చిన్నారి పెళ్లికూతుళ్లు: దేశంలోనే ఏపీ టాప్.. తెలంగాణ స్థానమెంతంటే?

Update: 2022-05-19 07:20 GMT
దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. సకల సౌకర్యాలు వచ్చి పడుతున్నా కూడా జనాల మైండ్ సెట్ మాత్రం మారడం లేదు. దేశంలో బాల్య వివాహాలు ఆగడం లేదు.  సామాజిక దురాచారాలు ఆగడం లేదు.  ముఖ్యంగా బాల్య వివాహాలు ఏమాత్రం తగ్గడం లేదు. పుస్తకాలు పట్టుకునే వయసులోనే అమ్మాయిలు మెడలో పుస్తెల తాడులు వేసుకొని వెళుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసే అంశంపై దేశవ్యాప్తంగా జరిపిన ఓ సర్వేలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఏపీలో ఎక్కువగా చిన్న వయసులోనే అమ్మాయిలకు పెళ్లితంతు ముగించేసి.. తల్లిదండ్రులు వారిని అత్తారింటికి పంపేస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5లో వెల్లడైంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా.. కేరళ రాష్ట్రం చివరి స్థానంలో నిలిచింది.

2019 జులై 5వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకూ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే జరిగింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లోని సుమారు 11346 ఇళ్లను ఈ సర్వే బృందం కలిసింది. దేశ సగటు 33శాతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో తక్కువ వయసు గల వివాహాల రేటు 29.3 శాతానికి తగ్గింది. అయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే ఇప్పటికీ అత్యధికం.

ఏపీలోని కొన్ని జిల్లాల్లో  పోలిస్తే బాల్య వివాహాల శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 15-19 సంవత్సరాల వయసు గల మహిళలు ఇప్పటికే తల్లలుగా మారిన అనేక కేసులు కూడా ఈ సర్వేలో వెలుగుచూశాయి.

కోవిడ్ 19 మహమ్మారితో కూడా రాష్ట్రంలో బాలయ్య వివాహాల సంఖ్య పెరిగిందని చైల్డ్ డెవలప్ మెంట్ సర్వేలో తేలింది.అనంతపురం, ప్రకాషం జిల్లాలు 37.3 శాతంతో అత్యధికంగా తక్కువ వయసు గల వివాహాల రేటును నమోదు చేయగా.. కర్నూలు 36.9 శాతంతో రెండో స్థానంలో ఉంది.

ఇక 23.5 శాతంతో తక్కువ వయసు గల వివాహాల రేటుతో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. కర్ణాటక 21.3శాతంతో మూడోస్థానంలో.. తమిళనాడు 12.8శాతంతో నాలుగో స్థానంలో ఉన్నాయి. కేరళలో అతి తక్కువగా 6.3 శాతం మాత్రమే చిన్నారుల పెళ్లిళ్లు జరిగినట్లు ఈ సర్వేలో తేలింది.
Tags:    

Similar News