మత్స్యకారులకు అండగా నిలుస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన నరసాపురం సభ.. ఏపీ రాజకీయాల్ని వేడెక్కించేలా చేసింది. ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా తప్పు పడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆ శాఖా మంత్రి అప్పలరాజు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
జీవో 217కు.. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన.. విషయాల మీద ఏ మాత్రం అవగాహన లేని అజ్ఞాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అని ఫైర్ అయ్యారు.
నరసాపురంలో జరిగింది మత్స్యకార సభ కాదని.. సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ అంటూ ఎద్దేవాచేశారు. మత్య్సకారుల సమస్యపై అవగాహన లేని పవన్ సినిమా స్క్రిప్టులు.. చంద్రబాబు పంపిన స్క్రిప్టు చదివినట్లుగా ఉందే తప్పించి మరోలా లేదంటూ విరుచుకుపడ్డారు. మంత్రి అప్పలరాజుతో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యుడు గతంలో మంత్రిగా వ్యవహరించిన మోపిదేవి కీలక వ్యాఖ్యలు చేశారు. వారేం అన్నారో వారి మాటల్లోనే చూస్తే..
- జీవో 217 వల్ల మత్స్యకారులకు మరింత లాభం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బతుకులు మార్చేందుకు చేపల అవుట్ లెట్‌లతో విక్రయాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
- మత్స్యకారులకు మేలు చేస్తున్న సీఎం జగన్‌పై విమర్శలు చేయడం సరికాదు.
- యువకులకు ఉపాధి కల్పిస్తుంటే.. ప్రభుత్వం చేపలు అమ్ముతోందని ఎద్దేవా చేయడం సబబు కాదు. ఇలా మాట్లాడటం మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించటమే.
- ఇలా చేసిన వారు ఎవరైనా సరే ఊరుకునేది లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మత్స్యకారులు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ.
- పవన్ కల్యాణ్ కు ఎలాంటి అవగాహన లేకుండా 215, 217 జీవోలపై జెట్టి, గంగమ్మ పూజలు, ఫిషింగ్ హార్బర్ అంటూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారు.
- ఈ జీవోను పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్నాం. 27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లాం వాస్తవంగా తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయి. వేల ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో ఉండటం లేదు.
- దీంతో వాటిపై వచ్చే ఆదాయం దళారీ వ్యవస్థకే చెందుతోంది. ఈ వ్యవస్థను రూపుమాపి ఆ ఫలాన్ని సొసైటీల ద్వారా మత్స్యకారులకు అందించేందుకు మా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఉపకరిస్తుంది. దళారి వ్యవస్థను రూపుమాపి మత్స్యకారుల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
- మత్స్యకార సొసైటీలో ప్రతి సభ్యుడికి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా చూసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 217 జీవో తీసుకొచ్చారు.