మంచి నిర్ణయం ఎవరు తీసుకున్నా వారిని అనుకరించటం తప్పేం కాదు. తాజాగా ఏపీఎస్సీ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిని వెనువెంటనే తెలంగాణ ఆర్టీసీ ఫాలో కావటం మంచిదన్న భావన కలుగుతోంది. ప్రయాణికులు.. సిబ్బంది అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని అందించాలని నిర్ణయించిన సేవలపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ అమరావతి.. గరుడ.. వెన్నెల.. ఇంద్ర.. లాంటి సర్వీసుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు అరలీటరు వాటర్ బాటిల్ ఇస్తున్నారు.
దీని స్థానే లీటరు వాటర్ బాటిల్ ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఏపీ ఆర్టీసీ నిర్ణయించింది. అంతేకాదు.. నాన్ ఏసీ డీలక్స్.. సూపర్ లగ్జరీ బస్సుల్లో జర్నీ చేసే ప్రయాణికులకు సైతం లీటరు వాటర్ బాటిల్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక.. ఎక్స్ ప్రెస్.. ప్యాసింజర్ (పల్లెవెలుగు) బస్సుల్లో 20 లీటర్ వాటర్ బాటిళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. మండే ఎండలతో తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందుల్ని గుర్తించిన ఏపీఎస్సీ ఆర్టీసీ ఇప్పటికే కొన్ని డిపోల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు జరపటం.. వాటిని అపూర్వ ఆదరణ రావటంతో మొత్తంగా ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
దీంతో పాటు.. డ్రైవర్లకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్న నిర్ణయాన్ని ఏపీ అధికారులు తీసుకున్నారు. డ్రైవర్.. కండక్టర్లకు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వాలని.. ఇందుకోసం రూ.6 ఖర్చు చేయాలనీ నిర్ణయించింది. తాజాగా కల్పించనున్న సౌకర్యాల కారణంగా నెలకు రూ.8కోట్ల మేర ఆర్టీసీకి ఖర్చు అవుతుందని లెక్కలు వేశారు. ప్రయాణికుల సౌకర్యాలతో పోలిస్తే.. ఈ మొత్తం చిన్నదనే చెప్పాలి. మరి.. ఇదే తరహా సేవల్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీసుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.