వినూత్న కార్యక్రమాలతో దూసుకెళుతున్న ఏపీఎస్ ఆర్టీసీ తాజాగా మరో ఆఫర్ ను ప్రకటించింది. వెనుక సీట్లను ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీ సౌకర్యం.. అమరావతి బస్సుల్లో సీటుకో టీవీ సౌకర్యం లాంటి కార్యక్రమాలతో దూసుకెళుతున్న ఆర్టీసీ.. తాజాగా మరో ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది. ఈ వాలెట్ నుంచి టికెట్ కొనుగోలు చేసిన వారికి ప్రయాణ ఛార్జీలో పది శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో.. ఏపీఎస్ ఆర్టీసీ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న వారికి మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి.
ఆర్టీసీ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాక రూ.100 టికెట్ విలువ ప్రయాణికుడి ఖాతాలో జమ కానుంది. యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసేందుకు వీలుగా ఈ వాలెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ సౌకర్యం సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ వాలెట్ లో కొంత మొత్తాన్ని జమ చేయటం ద్వారా.. తమకు అవసరమైన టికెట్లను కొనుగోలు చేసినప్పుడు సదరు వాలెట్ లో ఉన్న మొత్తంతో టికెట్ కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. ఈ వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే వారికి టికెట్ విలువలో 10 శాతం రాయితీ కల్పిస్తోంది. దీనికి అదనంగా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి 24 గంటల వ్యవధిలో టికెట్ రద్దు చేసే సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించనుంది. సో.. ఏపీఎస్ ఆర్టీసీ యాప్ ను మీ మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవటం అవసరమన్న మాట.