ఏపీలో ఆర్టీసీ చార్జీల బాదుడుకు రంగం సిద్ధమైంది. బస్సు చార్జీ లను 10 నుంచి 15 శాతానికి పెంచనున్నారు. ఈ మేరకు మూడు ప్రతిపాదనలు సీఎం చంద్రబాబుకు పంపినట్టు సమాచారం. ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మాట్లాడుతూ ఏపీ ఆర్టీసీ నష్టాల్లో ఉందని..ఈ నష్టాలను కొంత వరకైనా తగ్గించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయన అంటున్నారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం గణాంకాలు పరిశీలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.25 కోట్ల నష్టం వాటిల్లింది. గతేడాదితో పోలిస్తే 85 శాతం నష్టాలు తగ్గాయి. డీజిల్ రేట్లు తగ్గడం వల్ల రూ.65 కోట్లు, అంతర్గత సామర్థ్యం పెంపువల్ల రూ.70 కోట్ల మేర నష్టం తగ్గినా ఉద్యోగుల జీతభత్యాలను పెంచడం వల్ల నెలకు సంస్థపై రూ.55 కోట్ల మేర అదనపు భారం పడినట్టు ఆయన చెప్పారు.
విజయవాడకు ఏపీ ఆర్టీసీ :
రాష్ర్ట విభజన తర్వాత ప్రస్తుతం కూడా ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచే పనిచేస్తోంది. ఇది ఏపీ రాజధాని కేంద్రమైన విజయవాడకు సెప్టెంబర్ నాటికి మారనుంది. అప్పటి నుంచి విజయవాడ కేంద్రంగానే ఏపీ ఆర్టీసీ పని చేస్తుందని ఆయన అంటున్నారు. అలాగే డిసెంబర్ చివరి నాటికి ఉద్యోగులందరూ పూర్తి స్థాయిలో విజయవాడకు తరలివస్తారని సాంబశివరావు చెప్పారు.