ఢిల్లీ పీఠాన్ని కేజ్రీ అధిరోహించినప్పటి నుంచీ మోడీ - కేజ్రీవాల్ మధ్య - బీజేపీ - ఆప్ ల మధ్య జరుగుతున్న హడావిడి అంతా ఇంతా కాదు. అయితే అది రాజకీయాలకు సంబందించిన విషయం. అదే దేశ భద్రతకు సంబందించిన విషయాలు అయితే... అంతా ఒక్కటే అని చెబుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న తరుణంలో, నిత్యం ఆయన్ను విమర్శించే వారు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
మోడీతోనూ - కేంద్ర ప్రభుత్వంతోనూ ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారనే విమర్శను ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. పలు విషయాల్లో మోడీతో తాము విబేధించినా... సర్జికల్ స్ట్రైక్ విషయంలో మాత్రం ఆయన్ని అభినందించక తప్పదని కేజ్రీవాల్ అన్నారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలో మోడీ చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్నానంటూ కేజ్రీవాల్ తెలిపారు. ఇదే సమయంలో సర్జికల్ దాడులను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పిన కేజ్రీ... ఈ విషయంపై పాక్ ఆర్మీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ - ప్రధాని మోడీకి చేస్తున్న అప్పీల్స్ ఇవేనంటూ ఒక ప్రకటనను ట్విట్టర్ లో సైతం పోస్ట్ చేశారు కేజ్రీ.
Full View