బీహార్ ఎన్నికల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కులాల రణంగా మారిన బీహార్ ఎన్నికల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కు ‘సామాన్యుడి’ అండ లభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పూర్తి మద్ధుతు ప్రకటించారు. నితీశ్ కు ఓటేయాలని ఆయన బీహార్ ఓటర్లను కోరుతున్నారు.
తన ప్రకటనను మీడియా సంస్థలు తప్పుగా వక్రీకరించాయని.. తన పూర్తి మద్ధతు నితీశ్ కేనని చెప్పిన కేజ్రీవాల్.. మంచి మనిషి అయిన నితీష్ కే ఓటు వేయాలని కోరారు. అంతేకాదు.. తన అభిప్రాయాన్ని ఆయన ట్వీట్ రూపంలో వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎవరికి మద్ధతు ఇవ్వనని.. ఎవరి తరఫునా ప్రచారం చేయనంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇందులో వాస్తవం లేదని తన పూర్తి మద్ధుతు జేడీయూకి ఉందంటూ ఆయన ప్రకటించారు.
అయితే.. కేజ్రీవాల్ కు జేడీయూకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వారణాసిలో ప్రధాని మోడీ పై పోటీ చేసిన ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ కు అప్పట్లో జేడీయూ మద్ధతుగా నిలిచింది. నాటి సాయానికి గురుతుగా తాజాగా తన మద్ధుతును కేజ్రీవాల్ ప్రకటించారని చెప్పాలి. మరి.. సామాన్యుడి దన్ను నితీశ్ కు ఏ మాత్రం లాభం చేకూరుతుందో బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడైతేనే తెలుస్తుంది.