కెనడాలో జరిగిన ఒక డెవలప్మెంట్ చూసిన తర్వాత దాని తాలూకు ప్రభావం తొందరలోనే ఇండియాలోను ముఖ్యంగా పంజాబ్ లో తీవ్ర ప్రభావం చూపిస్తుందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కెనాడలో డెవలప్మెంటుకు పంజాబ్ కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా ? తప్పకుండా ఉంది. అది కూడా డేంజర్ బెల్స్ మోగేంత దగ్గరలోనే ఉందనే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే భారత్ లో ఖలిస్థాన్ దేశం కోసం కెనడాలో మంగళవారం రెఫరెండం జరిగింది.
కెనడాలో సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థకు మంచి పట్టుంది. ఈ సంస్థ పంజాబ్ ను ప్రత్యేక ఖలిస్థాన్ దేశంగా ప్రకటించాలంటు ఎప్పటినుండో పోరాటాలు చేస్తోంది. తన పోరాటాలకు మద్దతుగా కెనడాతో పాటు పంజాబ్ లో కూడా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఎస్ఎఫ్జే నిర్వహించే కార్యక్రమాలు కెనడాలో చట్టబద్దమేమో కానీ పంజాబ్ లో మాత్రం చట్ట వ్యతిరేకమనే చెప్పాలి. అందుకనే పంజాబ్ లో ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలన్నింటినీ చేస్తోంది.
ఇందులో భాగంగానే కెనడాలో సపరేట్ ఖలిస్థాన్ దేశం కావాలంటు ఏకంగా రెఫరెండంనే నిర్వహించింది. విషయం తెలియగానే భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వానికి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. సపరేట్ ఖలిస్ధాన్ డిమాండ్ తో రెఫరెండం జరగకుండా చూడాలని కెనడా ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం చాలా ఒత్తిడి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని కెనడా పట్టించుకోలేదు. చట్టానికి లోబడి తమ దేశంలో ఎవరు ఏమి చేసినా ప్రభుత్వం జోక్యం చేసుకోదని అక్కడి ప్రభుత్వం స్పష్టంగా తేల్చి చెప్పేసింది.
కెనడాలో సిక్కులు సుమారు 10 లక్షల మందున్నారు. రెఫరెండంలో వీళ్ళలో అత్యధికులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖలిస్ధాన్ దేశానికి అనుకూలంగానే ఓట్లు పడ్డాయి. ఇదే పంజాబ్ లో డేంజర్ బెల్స్ మోగించబోతోంది. తాజా రెఫరెండం ఆధారంగా పంజాబ్ లో తొందరలోనే ఖలిస్థాన్ ఉద్యమానికి ఊపు తేవాలని ఎస్ఎప్జే నిర్ణయించింది. ఊపుతేవటం అంటే ఏమీ లేదు శాంతి భద్రతల సమస్యలు తీసుకురావటమే. రాజకీయ నేతలను, సమాజంలో ప్రముఖులను టార్గెట్ చేయటమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.