మరిన్ని ప్రాణాంతక రోగాలు కాచుకునున్నాయా ?

Update: 2021-01-05 01:30 GMT
కరోనా వైరస్ లాంటి మరిన్ని ప్రాణాంతక రోగాలు కాచుకుని ఉన్నాయా ? అవుననే అంటున్నారు కాంగో డెమొక్రటిక్ రిపబ్లిక్ ప్రొఫెసర్ జీన్ జాక్సెస్ ముయొంబే టాంఫమ్. ఈయన సీఎన్ఎన్ తో మాట్లాడుతు ప్రపంచ మానవాళికి ప్రాణాంతక రోగాల ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. 1976లో ఎబోలా వైరస్ ను గుర్తించటంలో కృషి చేసిన శాస్త్రవేత్తల బృందంలో టాంఫమ్ కూడా ఒకరు.

తొందరలో బటయపడే రోగాలు కరోనా వైరస్ కన్నా ప్రాణాంతకమని హెచ్చరించారు. జంతువుల నుండి మనుషులకు సోకే జునోటెక్ వ్యాధులు ప్రభలవచ్చని హెచ్చరించారు. అటువంటి వ్యాధుల్లో ర్యాబిస్, ఎల్లోఫీవర్ కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుచేశారు. టాంఫమ్ బృందం హెచ్చరించిన కొత్తరకం వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్ధ డిసీజ్ ఎక్స్ అని నామకరణం కూడా చేసింది.

డిసీజ్ ఎక్స్ గురించి ఆరోగ్య సంస్ధ మాట్లాడుతూ దీని తీవ్రత గురించి ఇపుడే ఏమీ చెప్పలేమన్నది. ఎబోలా వైరస్ లాగ, కరోనా వైరస్ లాగే ఇది కూడా ప్రపంచ మానవాళికి హానికరమని మాత్రం అంచనా వేస్తోంది. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసేయటం మాత్రం ఖాయమని కూడా హెచ్చరించింది.


Tags:    

Similar News