రెండు పార్టీల్లోను సేమ్ సీన్లు రిపీటవుతున్నాయా ?

Update: 2022-07-23 16:30 GMT
వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న రెండు ప్రధాన పార్టీల్లోను కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒకే రకమైన సీన్లు కనబడుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్య గొడవలు, అంతర్గత పోరు, సహాయ నిరాకరణ లాంటివి ఇటు అధికార వైసీపీ అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కనబడుతున్నాయి.

రెండుపార్టీల్లో ఇలాంటి గొడవలున్న నియోజకవర్గాలు సుమారు 20 దాకా ఉన్నట్లు అంచనా. ఈ గొడవలను సర్దుబాటు చేసి నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు నానా అవస్థలు పడుతున్నారు.

 వైసీపీలో కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎంఎల్ఏకి మరికొందరు నేతలతో ఏమాత్రం పడటం లేదు.  టీడీపీకి సంబంధించి ఇలాంటి సమస్యలే ఇదే జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, పులివెందులలో కనబడుతోంది. అలాగే కర్నూలు జిల్లాను చూస్తే వైసీపీలో పెద్ద సమస్యలు లేవు. అయితే టీడీపీ మాత్రం నంద్యాల, ఆళ్ళగడ్డలో గొడవలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక అనంతపురం జిల్లా టీడీపీలో కళ్యాణ దుర్గం, పుట్టపర్తి, అనంతపురం, మడకశిర, కదిరి, గుత్తి నియోజకవర్గాల్లో బాగా గొడవలున్నాయి. అలాగే వైసీపీలో హిందూపురంలో వివాదాలు పెరిగిపోతున్నాయి.

చిత్తూరు జిల్లాకు సంబంధించి టీడీపీలో చంద్రగిరి, చిత్తూరు, పలమనేరు, తంబళ్ళపల్లి, శ్రీకాళహస్తి, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, తిరుపతిలో గొడవలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీలో పెద్దగా గొడవలు లేవనే చెప్పాలి. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, నెల్లూరు నియోజకవర్గాల్లోని తమ్ముళ్ళ మధ్య పోరు బాగా ఎక్కువగా ఉంది. వైసీపీలో పెద్దగా గొడవలు లేవనే చెప్పాలి.

ఇలాంటి గొడవలే మిగిలిన జిల్లాల్లో కూడా కనబడుతున్నాయి. టీడీపీలో గెలిచిన వైసీపీకి దగ్గరైన నలుగురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, కరణం బాలరామ్, మద్దాలిగిరి నియోజకవర్గాల్లో గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటివే టీడీపీలో కానీ వైసీపీలో కానీ మొత్తం మీద 20-25 నియోజకవర్గాలున్నట్లు సమాచారం. మరీ  గ్రూపు రాజకీయాలను, ఆధిపత్య గొడవలను కంట్రోల్ చేయకపోతే రెండు పార్టీలకు నష్టాలు తప్పేట్లు లేదు.
Tags:    

Similar News