అర్జున ఎంపిక‌లపై మాజీ ఆట‌గాళ్ల‌ ల ఫైర్‌!

Update: 2017-08-23 08:37 GMT
ఏ క్రీడాకారుడైనా త‌న ప్ర‌తిభ‌కు గుర్తింపు ల‌భించిన‌పుడే సంతోష‌ప‌డ‌తాడు. మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన ఆట‌గాళ్ల‌కు ద‌క్కే అవార్డులే వారి ప్ర‌తిభ‌కు కొల‌మానం. క్రీడ‌ల‌ల‌తో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన క్రీడాకారుల‌కు ప్రతి ఏటా అర్జునా అవార్డులను కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తుంది.  ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అర్జున అవార్డుల ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌పై తాజాగా కొన్ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆట‌గాళ్లే త‌మ‌కు అర్జునా అవార్డు కావాలంటూ కోరుకోవ‌డం స‌రికాద‌ని కొంద‌రు మాజీ అవార్డు గ్రహీత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అస‌లు ప్ర‌తి ఏటా ఈ అవార్డులు ఇవ్వ‌వ‌ల‌న‌సిన అవ‌స‌రం ఏముంద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

అర్జునా  పురస్కారాల ఎంపిక విధానం - ప్రదానాన్ని కూడా కొంద‌రు మాజీలు త‌ప్పుబ‌ట్టారు. 'అర్జున అవార్డుల గౌరవాన్ని కాపాడాలి. అసలు ప్రతీ ఏటా అర్జున ఇవ్వాల్సిన అవసరం ఏముంది?' అని మాజీ అవార్డు గ్రహీతలు అంటున్నారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌ చంద్‌ కుమారుడు - హాకీ జట్టు మాజీ కెప్టెన్ అశోక్‌ కుమార్‌ - లెజెండరీ మిడిల్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ శ్రీరామ్‌ సింగ్‌ - వాలీబాల్‌ కెప్టెన్ సురేశ్‌ మిశ్రాలు ఈ విధానంపై విమ‌ర్శ‌లు గుప్పి
స్తున్నారు. అవార్డుల ఎంపికపై  ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టాలని - ఆసియాడ్‌ - ఒలింపిక్‌ పతక విజేతలకే ఈ అవార్డుల‌ను ప్రదానం చేయాలన్న నిబంధన ఉండాలని వారు సూచిస్తున్నారు. ఎవ‌రికి వారు త‌మ‌కు అవార్డులు కావాల‌ని ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం ఏమిట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.  తమకు పురస్కారాలు ఇవ్వాలని ఆటగాళ్లే స్వయంగా దరఖాస్తు చేసుకునే మూస విధానానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని వారు అన్నారు. ప్ర‌తిభ‌ను బ‌ట్టి క్రీడాకారులు సాధించిన విజ‌యాల‌ను బ‌ట్టి  ప్రభుత్వమే వారిని గుర్తించాల‌ని చెప్పారు.

కొంత‌మంది ఆట‌గాళ్ల‌ను సిఫారసు చేయడం, అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల‌ని కోర‌డం స‌రికాద‌ని భారత స్క్వాష్‌ మాజీ ఆటగాడు సౌరవ్‌ ఘోషల్ అభిప్రాయ‌ప‌డ్డారు. 'నాకైతే అవార్డులకు ఫలానా వ్యక్తిని సిఫారసు లేదా నామినేట్‌ చేసే ప్రక్రియలోనే లోపం ఉందనిపిస్తోంది. పురస్కారాల కమిటీనే ప్రతిభ ఆధారంగా విజేతలను ప్రకటించాలి. అవార్డుకు దరఖాస్తు చేయడం అంటే తమకు ప్రయోజనం కల్పించాలని కోరినట్టే' అని అన్నారు. ఈ విధానం వ‌ల్ల కొంద‌రు ఆట‌గాళ్ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని కొంద‌రు అన్నారు. 1972లో తాను ఆసియా పతకం సాధించినా అర్జున ఇవ్వలేదని సీనియరైన బీఎస్‌ చౌహాన్‌కు ఇచ్చారని షెకావత్‌ అన్నారు. అర్జున అవార్డు కు కనీస అర్హతగా ఆసియా గేమ్స్‌ను  రాజీవ్ ఖేల్‌రత్నను గొప్పగా చూడడం అర్జున అవార్డును అవమానించడమేనని అన్నారు. ఈ సూచ‌న‌ల‌ను కేంద్రం ఎంత‌వ‌ర‌కు ప‌రిగ‌ణిస్తుందో వేచి చూడాలి.
Tags:    

Similar News