పీక్స్ కు ఆర్మీలో అవినీతి ఆరాచకం?

Update: 2017-02-07 04:49 GMT
విన్నంతనే నవ్విపోయే ఉదంతం. భారత ఆర్మీలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పే వైనంగా దీన్ని చెప్పాలి. ప్రపంచం మొత్తానికి తెలిసిన పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కొంత భూమిని భారత ఆర్మీ అద్దెకు తీసుకోవటమే కాదు.. గడిచిన కొన్నేళ్లుగా రెగ్యులర్ గా అద్దె కడుతున్న వైనం ఇప్పుడు విస్మయకరంగా మారింది. ఆర్మీలోని కొంతమంది అధికారుల అవినీతి కక్కుర్తితో ఇలాంటి ఉదంతం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

గడిచిన 16 ఏళ్లుగా పాక్ అక్రమిత కశ్మీర్ లోని సర్వే నెంబర్లు 3000.. 3035.. 3041.. 3045 లలోని భూమిని భారత ఆర్మీ అద్దెకు తీసుకున్నట్లుగా కొన్ని పత్రాలు బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. అంతేనా.. ఈ పత్రాల్లోని సమాచారం ప్రకారం.. పాక్ అక్రమిత భూమిని అద్దెకు తీసుకున్న ఆర్మీ అధికారులు కొన్నేళ్లుగా లక్షలాది రూపాయిల్ని అద్దె రూపంలో చెల్లిస్తుండటం విశేషం.

అవినీతికి పీక్స్ గా మారిన ఈ ఉదంతాన్ని చూస్తే.. 2000సంవత్సరం నుంచి ఈ భారీ అవినీతి మొదలైనట్లుగా చెబుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన పత్రాల్లో పేర్కొన్న సర్వే నెంబర్లలోభూమి యజమాని ఎవరు? అసలు ఉన్నాడా? లేడా? భారత ఆర్మీ చెల్లింపులు ఎవరికి వెళ్లాయి? వంటి కోణాలపై అధికారులు తాజాగా ఫోకస్ చేశారు.ఈ యవ్వారంతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న అంశంపై విచారణ అధికారులు విచారణను వేగవంతం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News