మసీద్‌ పై దాడి..14మంది తబ్లిగీ సభ్యుల అరెస్ట్‌

Update: 2020-04-06 09:10 GMT
దేశంలో కరోనా వైరస్‌ విజృంభించడానికి కారణమైన తబ్లిగ్‌ జమాత్‌ సభ్యులు బయటకు రావడం లేదు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మసీదులో జరిగిన ప్రార్థనలకు హాజరైన వారి వలన ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో తబ్లిగీ సంఘం సభ్యులు దేశంలో వారి సొంత ప్రాంతాల్లో దాక్కున్నారు. వారిని బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా వారు బయటకు రావడం లేదు. ఈ క్రమంలో అలాంటి వారిని ధికార యంత్రాంగం గుర్తించే పనిలో ఉంది. ఈ క్రమంలో తబ్లిగీ సంఘం సభ్యులను గుర్తించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది తబ్లిగ్ జమాత్ సభ్యులను సైనికులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కంటోన్ మెంట్‌ లో సైనికులు గుర్తించి వారిని పోలీసులకు అప్పగించారు.

లక్నోలోని ఆర్మీ కంటోన్ మెంట్‌ లోని సదర్ బజార్ అలీజాన్ మసీదులో కరోనా వైరస్ లక్షణాలతో 14 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులు దాక్కున్నారని లక్నో మిలటరీ ఇంటలిజెన్స్‌ కు సమాచారం వచ్చింది. ఈ సందర్భంగా వెంటనే వారిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. వారు దాక్కున్న అలీజాన్ మసీదుకు సీలు చేసినా అందులో ఉన్నవారికి ఆహార ప్యాకెట్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అందిస్తున్నట్లు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులకు సమాచారం తెలిసింది. దీంతో ఆ మిలిటరీ అధికారులు వెంటనే లక్నో పోలీస్‌ కమిషనర్‌ కు సమాచారం అందించారు. స్థానిక పోలీసుల సహకారంతో కలిసి ఆ మసీదుపై దాడి చేశారు. ఆ క్రమంలో లోపల సహరాన్‌ పూర్ నగరానికి చెందిన 12 మంది తబ్లిగ్ జమాత్ సభ్యులను మిలిటరీ - పోలీసులు వారిన పట్టుకున్నారు. వీరంతా ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంలో పాల్గొన్నారని.. వారిక కరోనా లక్షణాలుండడంతో మసీదులో దాక్కున్నారని తేలింది.

12 మంది తబ్లీగ్ జమాత్ సభ్యులు - మరో ఇద్దరు సహచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మసీదులో ఉన్న వారిలో 8 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో సంచలనం రేపుతోంది. వారికి జారా క్లినిక్ డాక్టర్ ఆసిఫ్ ఖాన్ తబ్లిగ్ జమాత్ సభ్యులకు చికిత్స అందించారని తేలడంతో ఆ వైద్యుడిని కూడా అరెస్ట్‌ చేశారు. మసీదులో దాక్కున్న వారిలో జబీర్ హసన్ (49) - అఫ్తాబ్ (71) - తన్వీర్ ఆలం (32) - కుర్బన్ (50) - అఫ్జల్ - ఫర్మాన్ (30) - నాసిమ్ (54) - ఇంటెజార్ (46) - రఫీక్ - డానిష్ - కుర్బన్ - ఇర్ఫాన్ (71) - అథర్ - మీరాజుద్దీన్‌ ఉన్నారు.

--
Tags:    

Similar News