ఈమధ్య కాలంలో తమతమదేశాల్లో హాయిగా బ్రతుకుతున్న వారు, ఆ దేశంలో పుట్టినందుకే ప్రస్తుతం వారుంటున్న స్థాయికి చేరుకోగలిగారనే విషయాలు మరిచిన చాలా మంది మాతృభూమి విషయంలో కారుకూతలు కూస్తుంటారు. మేము గానీ.. అమెరికాలో గానీ.. పుట్టి ఉంటే గానీ.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. వినడానికి అసభ్యంగా - అత్యంత ఇబ్బందిగా అనిపించే "అమెరికాలో పుట్టడం" అనే విషయం ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో నిలిచింది. అయితే ఈయన ఆ ఉద్దేశ్యంతో అన్నట్లు అనిపించకపోయినా... తాను గనుక అమెరికాలో జన్మించి ఉంటే.. అంటూ మొదలుపెట్టారు ఆర్నాల్డ్!
తాను అమెరికాలో జన్మించి ఉంటే అధ్యక్ష పదవి రేసులో ఉండేవాడినని ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ అన్నారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు కాలిఫోర్నియా గవర్నర్ గా పనిచేసిన ఆర్నాల్డ్ కు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు మాత్రం అర్హత లేదు. దానికి కారణం... ఆయన ఆస్ట్రియాలో జన్మించారు. తాను రిపబ్లికన్ లకే మద్దతిస్తానని, రిపబ్లికన్ గా చెప్పుకునేందుకు గర్విస్తానని చెప్పే ఆర్నాల్డ్... ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ కు మాత్రం ఓటు వేయబోనని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అమెరికా ఎన్నికలు, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పై మరోసారి స్పందించారు ఆర్నాల్డ్. తాను కచ్చితంగా రిపబ్లికన్ లకే మద్దతిస్తానని చెబుతూనే... ట్రంప్ కు మాత్రం ఓటువేసేది లేదని, తాను మాత్రం అమెరికాలో జన్మించి ఉంటే రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష రేసులో ఉండేవాడినని, తాను రంగంలోకి దిగడానికి ఇది చాలా మంచి సమయం అని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/