ప్రస్తుతం నిరసనల రూపం మారుతున్న సంగతి తెలిసిందే. ఆందోళన చేయాలంటే..రోడ్డెక్కాల్సిన అవసరమే లేదు. అందరూ ఫాలో అయ్యే సోషల్ మీడియాను ఎంచుకుంటే చాలు! తాజాగా అదే జరుగుతోంది. భారత ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ట్విటర్‌లో తమిళనాడుకు చెందిన కొంతమంది నెటిజన్లు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా మధురైలో ఎయిమ్స్ శంకుస్థాపన చేయనున్నారు. చెన్నై- మధురై మధ్య తేజస్ రైలు సేవలను కూడా ప్రారంభించనున్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు.ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మోడీకి మద్దతుగా మరో హ్యాష్ ట్యాగ్ #TNWelcomesModi క్రియేట్ చేసి మోడీకి స్వాగతం పలుకుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌పై కొందరు మండిపడ్డారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని.. నాలుగేళ్లలో రాష్ర్టానికి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తమిళులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఏకంగా #GoBackModi అనే హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ట్విటర్ లో #GoBackModi హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. మధ్యాహ్నాం వరకు ట్విటర్ ట్రెండింగ్ లో #GoBackModi హ్యాష్ ట్యాగ్ టాప్-2లో ఉండగా #MaduraiThanksModi మూడోస్థానంలో స్థానంలో ఉంది. #TNWelcomesModi హ్యాష్ ట్యాగ్ ఆరో స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. ప్రతినెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ట్విటర్ లో ట్రెండింగ్ లో ఉండేది. ఇవాళ ఏడో స్థానానికి పడిపోయింది. గాజా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన తమను ఎవరూ పట్టించుకోలేదని - తమిళులు పెద్ద ఎత్తున తమ ఆవేదనను ట్వీట్ల రూపంలో తెలుపుతున్నారు.