మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాను హిందూయిజానికి వ్యతిరేకం ఎంతమాత్రం కాదన్నారు. కేవలం హిందూత్వ విధానాలకు వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణపై బీజేపీ కన్ను పడిందని.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోందని.. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్ కు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వస్తున్న నేపథ్యంలో అసద్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కల ఎప్పటికి నెరవేరదన్నారు.
ప్రధాని మోడీ రెండు గుళ్లకు వెళితే.. ధృడమైన హిందువైన కేసీఆర్ ఆరు గుళ్లకు వెళుతుంటారన్నారు. హిందూయిజం పేరు చెప్పి కేసీఆర్ ను బీజేపీ ఓడించలేదన్నారు. తాము హిందూయిజాన్ని వ్యతిరేకించమని.. కేవలం హిందూత్వ విధానాల్ని వ్యతిరేకిస్తామని అసద్ స్పష్టం చేశారు. చూస్తుంటే.. తన స్నేహితుడు కోసం ఎప్పుడూ లేని రీతిలో తాను హిందూయిజాన్ని వ్యతిరేకించనన్న మాటఅసద్ నోటి నుంచి వచ్చిందని చెప్పాలి. మరి.. ఇంత మాట్లాడుతున్న ఆయన.. కేసీఆర్ కోసం రానున్న రోజుల్లో మరెన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.