ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. దేశంలోని పలు రాష్ట్రాల్లో పాగా వేస్తున్న అసద్ కు ఎప్పుడూ ఎదురుకాని ఇరిటేషన్ పశ్చిమబెంగాల్ లో మొదలైంది. ఏదైనా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే చాలు.. చప్పుడు చేయకుండా.. కామ్ గా గ్రౌండ్ వర్కు చేయటం.. ఎవరి కంట పడకుండా.. తాము చేయాల్సిన పని పూర్తి చేయటం మజ్లిస్ అధినేత అసుదుద్దీన్ ఓవైసీకి అలవాటు.
పాతబస్తీలో ఒకటికి ఐదుసార్లు సక్సెస్ ఫుల్ గా అమలు చేసిన ఫార్ములాను మహారాష్ట్ర.. బిహార్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోనూ అప్లై చేయటం.. అంతో ఇంతో ఫలితాన్ని సాధించటం తెలిసిందే. తాను వ్యక్తిగతంగా లాభపడే కన్నా.. బీజేపీకి పరోక్షంగా సాయం చేస్తున్నారన్న ఆరోపణ అంతకంతకూ బలంగా వినిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగటం వల్ల మైనార్టీ ఓటు బ్యాంకు మజ్లిస్ కు మళ్లటం.. దీంతో చీలిన ఓట్లు బీజేపీకి లాభంగా మారటం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు విమర్శలు.. ఘాటు ఆరోపణలు చేసినా ఎవరూ ఏమీ మాట్లాడని పరిస్థితి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ కారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాదు.. ఆ పార్టీకి ఐదు అసెంబ్లీ స్థానాల్లో పాగా వేయటంతో పలు రాష్ట్రాల్లోని అధికారపక్షాల వారు మజ్లిస్ ను జాగ్రత్తగా గమనించటం మొదలుపెట్టారు. దీనికి తగ్గట్లే అసద్ సైతం.. తాము త్వరలో జరిగే పశ్చిమబెంగాల్.. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. దీనికి తగ్గట్లే.. ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతల్ని హైదరాబాద్ కు పిలిపించుకొని భేటీలు నిర్వహిస్తున్నారు. దీంతో.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కసారి అలెర్టు అయ్యారు.
గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికలు సాగటం.. అవి కాస్తా ఆమెకు కీలకంగా మారటంతో.. తన విజయవకాశాలకు అడ్డు వచ్చే ప్రతి ఒక్కరి విషయంలోనూ ఆమె ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ పై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోట్లాది రూపాయిలతో హైదరాబాద్ నుంచి ఒక పార్టీ తీసుకొచ్చి ముస్లిం ఓటర్లలో చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా బీజేపీకి.. అసద్ కు లింకు ఉందన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.
దీనిపై అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. డబ్బుతో అసుదుద్దీన్ ఓవైసీని కొనే మగాడు ఇంకా పుట్టలేదంటూ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం ఓటర్లు మమత సొంతం కాదన్నారు. ‘‘అసద్ ను డబ్బులో కొనే వ్యక్తి ఇంకా పుట్టలేదు. ఆమె ఆరోపణలు నిరాధారమైనవి. ఆమె బాగా అలిసిపోయారు. తృణమూల్ నేతలు పలువురు బీజేపీలోకి వెళుతున్నారు. కాబట్టి ఆమె ఆందోళన చెందాలి. మాకు ఓటు వేసిన బిహార్ ఓటర్లు.. ప్రజల్ని మమత అవమానించారు’’అని మండిపడ్డారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో పోటీ చేసినా.. అసద్ కు పెద్ద వ్యతిరేకత ఎదురుకాలేదు. విమర్శలు.. ఆరోపణల్ని ఎదుర్కోలేదు. అందుకు భిన్నంగా తొలిసారి ఆయనకు భిన్నమైన అనుభవం ఎదురైంది. దీంతో.. ఆయన నోటి నుంచి ‘మగాడు’ మాటలు బయటకు వచ్చాయని చెబుతున్నారు. చూస్తుంటే.. ఈసారి అసద్ ప్రయాణం సాఫీగా సాగేట్లుగా లేదన్న అభిప్రాయం కలుగక మానదు.