తెలుగుదేశం పార్టీలో ఒకరు ఒక తీరుగా మాట్లాడుతూ.. చివరకు ఆ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే పార్టీ నాయకులు మరో మాట మాట్లాడుతుంటారు. తాజాగా ఈ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును ఇరకాటంలో పడేశాయి. జగన్ ను విమర్శించాలని పోయి తన పార్టీ అధినేత చంద్రబాబును ఇరుకునపెట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది.
విజయవాడలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీ కేశినేని నాని ప్రత్యక్షమయ్యారు. ఆయన అక్కడ కనిపించేసరికి కొందరు ఈయన ఎందుకు వచ్చారా అని అందరూ సందేహం వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం బిల్లుకు మద్దతు తెలిపిన తెలుగు దేశం పార్టీ ఎంపీలు ఈ సభలో పాల్గొనడంతో అందరూ అవాక్కయ్యారు. పార్లమెంట్ లో ఒకతీరు రాష్ట్రంలో ఒక తీరా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ సభ ప్రారంభంలోనే కేశినేని నాని సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయి. అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం మాదిరి తీర్మానం చేయాలని, అసెంబ్లీ లో తీర్మానం చేసి పంపాలని సవాల్ విసిరాడు. దీంతో టీడీపీలో గందరగోళం ఏర్పడింది. ఆయన చెప్పినట్టు అసెంబ్లీలో సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ జగన్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెడితే అందుకు టీడీపీ సభ్యులు తప్పని సరిగా మద్దతు తెలపాల్సి ఉంది. అదే కనుక జరిగితే.. పార్లమెంటులో సీఏఏకు మద్దతు తెలిపిన టీడీపీ ఇప్పుడు అసెంబ్లీ లో ఎలా ఓటేయాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ లో సీఏఏ వ్యతిరేక తీర్మానానికి మద్దతు తెలిపితే పార్లమెంట్ లో మద్దతు తెలిపిన అంశంపై టీడీపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి.
అయితే దీంతో పాటు చంద్రబాబు కు వ్యతిరేకంగా గతంలో అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తాను పర్యటిస్తానని ఎన్నికల సమయంలో ఓవైసీ చెప్పారు. అధికారంలో ఉన్న చంద్రబాబును ఓడించేందుకు తాను ఆంధ్రప్రదేశ్ కు వెళ్తునున్నానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి అలాంటి వ్యక్తి నిర్వహించిన సభకు టీడీపీ ఎంపీ, మాజీమంత్రి జలీల్ ఖాన్ కూడా వెళ్లారు. గతాన్ని మరచిపోయి ఎంపీ కేశినేని నాని, జలీల్ ఖాన్ ప్రశంసలు కురిపించడంతో అందరూ విస్మయం వ్యక్తం చేశారు. దీంతో తెలుగు దేశం పార్టీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. గతంలో మాదిరి రెండుకళ్ల సిద్ధాంతం మాదిరి ఇప్పుడు సీఏఏ, ఎన్నార్సీపై వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరి దీనిపై చంద్రబాబు ఒక స్పష్టమైన వైఖరి ప్రదర్శిస్తారా లేదా అనేది ఎదురు చూడాలి.