జేసీ దివాకర్ రెడ్డి అంశంపై కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. విమానశ్రయానికి గంట ముందు వచ్చినట్లు జేసీ చెప్పారని, కానీ సీసీ టీవీ ఫుటేజ్ లో అది తప్పుడు సమాచారమని తేలిందని ఆయన చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు.
విశాఖ విమానాశ్రయంలో గురువారం జరిగిన ఘటన తాలూకు సీసీటీవీ ఫుటేజ్ లు - పూర్తి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించినట్టు అశోక్ గజపతి రాజు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. భద్రతా సిబ్బంది వివరణ ప్రకారం విమానయాన సంస్థలు తగిన చర్యలు తీసుకున్నాయన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి విమాన ప్రయాణ నిషేధం, కొనసాగింపు మంత్రిత్వశాఖ పరిధిలోని అంశాలు కావని స్పష్టం చేశారు. నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయన్నారు. భద్రతా చర్యలకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవన్నారు.
సిబ్బందిపై జేసీ వీరంగాన్ని దేశీయ విమానయాన సంస్థలు సీరియస్ గా తీసుకున్నాయి. తమ విమానాల్లో జేసీ దివాకర్ రెడ్డి ప్రయాణాన్ని నిషేధించాలని ఇండిగో - ఎయిరిండియా - స్పైస్ జెట్ - జెట్ ఎయిర్ వేస్ - గో ఎయిర్ సంస్థలు నిర్ణయించిన విషయం తెలిసిందే.
గురువారం ఉదయం 7.30గం.కు ఎంపీ జేసీ ఎయిర్ పోర్టు టెర్మినల్ బిల్డింగ్ లోకి వెళ్లారు. ఆయన వెళ్లే విమానం 7.55గం.కు బయలుదేరాల్సి ఉంది. 7.10 గం.కే బోర్డింగ్ పాసుల ప్రక్రియ పూర్తయింది. ఆలస్యంగా వెళ్లిన జేసీ.. బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందిగా అధికారులతో గొడవపడ్డారు. అలా చేయడం నిబంధనలకు విరుద్దమని చెప్పినప్పటికీ.. తనతోనే రూల్స్ మాట్లాడతారా? అంటూ ఫైర్ అయ్యారు. కౌంటర్ వద్ద ఉన్న ప్రింటర్ ను విసిరేయడంతో పాటు ఓ ఉద్యోగిని మెడ పట్టుకుని గెంటేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
కాగా, చిన్నచిన్న వివాదాలు పార్టీ పరువును దిగజారుస్తున్నాయని సీఎం చంద్రబాబు ఒకింత సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/