చంద్రబాబు వద్దకు అశోక్ గజపతి పంచాయితీ

Update: 2020-12-17 16:37 GMT
పూసపాటి గజపతిరాజుల పంచాయితీ చంద్రబాబు వద్దకు చేరింది. విజయనగరం జిల్లాలో తిరుగులేకుండా 50 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతికి వైసీపీ ప్రభుత్వంలో చెక్ పడింది. ఆయన నుంచి అధికారం పోయి వైసీపీ నామినేట్ చేసిన ‘సంచయిత’కు దక్కింది. ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఓడిపోయిన అశోక్ గజపతి పరపతి పడిపోయింది. జిల్లా మొత్తం టీడీపీ చిత్తుగా ఓడి వైసీపీ గెలిచింది. అశోక్ గజపతిపై కోపంతో చాలా మంది వైసీపీకి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

విజయనగరం జిల్లాలో అశోక్ గజపతికి ఇన్నాళ్లు తిరుగులేదు. టీడీపీ జిల్లా కార్యాలయం కూడా ప్రత్యేకంగా లేదు. అశోక్ బంగ్లాలోని తోటలోనే చెట్ల కింద సమావేశం పెట్టుకునే వారు. ప్రత్యేకంగా టీడీపీ కార్యాలయం పెట్టుకుందామని నేతలు చెప్పినా ఇన్ని ఏళ్లుగా అశోక్ ఒప్పుకోలేదు.

ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో అశోక్ గజపతి ఘోరంగా ఓడిపోయాక ఆయనపై అసమ్మతి పెరిగిపోయింది. పార్టీ నేతలు ఆయన విషయంలో వ్యతిరేకంగా విజయనగరం జిల్లాలో ముందుకెళుతున్నారు.

అశోక్ గజపతి అంటే పడని చాలా మంది సీనియర్లు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతను ముందు పెట్టి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయించారు. దీన్ని అశోక్ గజపతి అడ్డుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అశోక్ గజపతిరాజు ఫిర్యాదు చేశాడు. కానీ గీత వర్గం దాన్ని లెక్కచేయలేదు.

దీంతో చంద్రబాబు వద్దే తేల్చుకోవాలని అశోక్ గజపతిరాజు నిర్ణయించారు. తన మద్దతుదారులను తీసుకొని తాజాగా మంగళగిరిలోని టీడీపీ ట్రస్ట్ భవన్ కు చేరుకున్నారు. విషయం తెలియడంతో గీత నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం కూడా ట్రస్ట్ భన్ కు బయలు దేరిందట.. దీంతో ఈ పంచాయితీని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.
Tags:    

Similar News