కాంగ్రెస్ అధ్యక్ష రేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ అధ్యక్ష ఎన్నికల్లో సోనియాగాంధీ ఏరికోరి రాజస్థాన్ సీఎంను నిలబెట్టాలని చూసింది. ఆయనా సరేనన్నారు. కానీ తర్వాత రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలెట్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ అసమ్మతి రాజేశాడు. రాజస్థాన్ లో తన అనుచర వర్గంతో రాజీనామాలు చేయించాడు. దీంతో అధిష్టానం సీరియస్ అయ్యింది. అశోక్ గెహ్లాట్ అభ్యర్థిత్వాన్ని పక్కనపెట్టినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష రేసులోంచి తాను తప్పుకుంటున్నట్టు రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించాడు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. రాజస్థాన్ లో జరిగిన నాటకీయ పరిణామాలతో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాగాంధీని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్ ఎమ్మెల్యేల వ్యవహారంపై సోనియాకు క్షమాపణలు తెలియజేసినట్లు పేర్కొన్నారు. అంతేగాక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ మధ్యే పోటీ ఉండనున్నట్లు తెలిపారు.
సోనియాతో భేటి అనంతరం అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయమని అభ్యర్థించానని.. కానీ అతడు అంగీకరించలేదన్నారు. దీంతో తాను పోటీచేస్తానని చెప్పానని.. కానీ ఇప్పుడు రాజస్తాన్ రాజకీయ సంక్షోభంతో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. రాజస్థాన్ లో జరిగిన పరిణామాలు బాధాకరం.. దీనిపై అధిష్టానానికి క్షమాపణలు తెలియజేస్తున్నా.. పార్టీలో తలెత్తిన అంతర్గత సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తా.. నేను సీఎంగా ఉండాలో లేదో సోనియా నిర్ణయిస్తారు’ అని అశోక్ గెహ్లాట్ తెలిపారు.
ఇలా ఈ వృద్ధ జంబూకం కాంగ్రెస్ అధ్యక్ష రేసులో పాల్గొనకుండా ఎమ్మెల్యేలతో ఈ ఆట ఆడించాడని అర్థమవుతోంది. అటు సచిన్ పైలెట్ ను సీఎం కాకుండా.. ఇటు తన సీఎం పదవి పోకుండా.. ఉత్సవ విగ్రహా మైన కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని వ్యూహాత్మకంగా అశోక్ గెహ్లాట్ వదిలించుకున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష రేసులో తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ లు పోటీపడుతున్నారు. వీరిలో ఒకరు కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడవుతారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.