'దేశాన్ని కాపాడుకుంటాం. తాలిబన్ల చేతికి అఫ్గాన్ ను చిక్కనివ్వను. మేం మీకు అండగా నిలుస్తాం' అంటూ శనివారం అఫ్గాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అఫ్గాన్ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. ఆదివారం మధ్యాహ్నానానికి దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవటం తెలిసిందే. ఆయన ఎక్కడకు వెళ్లారన్నది పక్కన పెడితే.. తాను దేశం విడిచి పెట్టి వెళ్లిన విషయానికి సంబంధించి ఆయనేం చెబుతున్నారన్న దానికి సమాధానంగా ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. అందులో తాను దేశాన్ని ఎందుకు విడిచిపెట్టి వెళ్లిందన్న విషయాన్ని ఆయన వివరంగా చెప్పుకొచ్చారు.
తాజా పోస్టుతో తాలిబన్ల విజయాన్ని పరోక్షంగా అంగీకరించిన ఆయన.. దేశ రక్షణ బాధ్యత తాలిబన్లదేనని చెప్పారు. తన అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో ఆయన పేర్కొన్న సందేశాన్ని ఆయన మాటల్లోనే చూస్తే..
'దేశ ప్రజలారా.. ఈ రోజు నేనో కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. గడిచిన 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నా దేశాన్ని వీడటం లేదంటే అధ్యక్ష భవనంలోకి ప్రవేశించాలని అనుకుంటున్న తాలిబన్లను ఎదుర్కోవటం లాంటి రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. నా నిర్ణయంతో అనేక మంది దేశ ప్రజలు అమరులు కావటం.. కాబూల్ నగరం విధ్వంసం కావటం.. ఈ రెండు పరిణామాలు అతి పెద్ద మానవ సంక్షోభాన్ని మిగులుస్తాయి. తాలిబన్లు నన్ను దించేయాలని నిర్ణయించుకున్నాను''
''కాబూల్ నగరాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. ఈ ఘోర రక్తపాతాన్ని నివారించేందుకు నేను దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. తాలిబన్లు విజయం సాధించారు. దేశ ప్రజల అస్థిత్వాన్ని గౌరవాన్ని.. సంపదను కాపాడాల్సిన బాధ్యత ఇక వారిదే. చట్టబద్ధంగా ప్రజల మనసుల్ని గెలుచుకోలేకపోయారు. వారిప్పుడు ఒక చరిత్రాత్మక పరీక్షను ఎదుర్కోబెతున్నారు. అఫ్గానిస్థాన్ పరువు ప్రతిష్ఠలను కాపాడతారా? లేదంటే అసాంఘిక శక్తులకు ఆశ్రయమిస్తారా? అఫ్గాన్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు''
''తమ భవిష్యత్తుపై వారికి భరోసా లేదు. అఫ్గాన్ ప్రజలతో పాటు వివిధ దేశాలకు తాలిబన్లు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా అఫ్గాన్ సోదరీమణుల మనసుల్ని చట్టబద్ధంగా గెలుచుకోవాల్సి ఉంది. దాని కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేయండి. దాన్ని ప్రజలకు చెప్పండి. దేశాభివ్రద్ధి గురించి నేను చేయాల్సిన కృషిని చేస్తుంటాను. అఫ్గానిస్థాన్ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా'' అని ముక్తాయించారు.