గ్లోబ్ ఆకారంలో అసెంబ్లీ భవనం

Update: 2015-07-23 18:08 GMT
నవ్యాంధ్ర రాజధానిలో నవ్యాంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ఎలా ఉండబోతోంది? హైదరాబాద్లో అసెంబ్లీ భవనాన్ని మించి ఉంటుందా? దేశంలో ఇటీవల కొత్తగా నిర్మించిన గుజరాత్, ఛత్తీస్ గఢ్ రాజధానుల్లా ఉంటుందా? ఇది అందరిలోనూ మెదలుతున్న ప్రశ్న. అయితే, ఈ ప్రశ్నలకు సింగపూర్ బృందం జవాబు చెప్పింది. నవ్యాంధ్ర అసెంబ్లీ భవనం గ్లోబ్ ఆకారంలో ఉండనుంది.

అత్యంత విశాలవంతమైన అసెంబ్లీ భవనానికి ముందు భారీగా ఖాళీ స్థలాన్ని వదిలేస్తారు. వాటిలో రెండు మూడు ఉద్యానవనాలను ఏర్పాటు చేస్తారు. ఇక అసెంబ్లీ ముఖ ద్వారాన్ని రివర్ ఫ్రంట్ రోడ్డుకు కలుపుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన అద్భుతమైన పచ్చని ప్రకృతి మధ్య ఉన్న ప్రపంచంలా నవ్యాంధ్ర అసెంబ్లీ భవనం ఉండనుంది.

అమరావతి గేట్ వే అంటే రాజధానికి ముఖ ద్వారం. ఇక్కడ నవ్యాంధ్ర రాజధానిని ప్రతిబింబించేలా భారీ టవర్ ను నిర్మిస్తారు.
Tags:    

Similar News