బాబు సీఎం అన్న జ్యోతిష్యుడు ఇప్పుడేం చెప్పారంటే..

Update: 2016-05-16 13:40 GMT
ఎన్నికల సీజన్ వస్తే చాలు.. పలు అంచనాలు వ్యక్తం కావటం మామూలే. ఇక.. స్వాములు.. జ్యోతిష్యులు సైతం భవిష్యత్తు గురించి జోస్యం చెప్పేస్తుంటారు. తాజాగా జరుగుతున్న తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆ రాష్ట్రానికి సీఎం అయ్యేదెవరన్న విషయాన్ని చెప్పుకొచ్చారు తిరుపతికి చెందిన శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్యస్వామి. ఈ పెద్దమనిషి ప్రత్యేకత ఏమిటంటే.. 2014 ఎన్నికల సమయంలో ఏపీ ముఖ్యమంత్రికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని జోస్యం చెప్పటం.

అప్పటి నుంచి ఆయన జోస్యం మీద కాస్త గురి పెరిగిన పరిస్థితి. తాజాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని చెప్పటమే కాదు.. 2019 ఎన్నికల తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని కూడా చెప్పేశారు.

ప్రస్తుతం నడుస్తున్న గ్రహాల ఆధారంగా చూస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మరోసారి సీఎం పదవిని చేపట్టటం ఖాయమని చెబుతున్నారు. అంతేకాదు.. 2019 ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రిగా లోకేశ్ కావటం ఖాయంగా చెబుతున్నారు. 2019 ఎన్నికల దాకా ఎందుకు? తమిళనాడు సీఎంగా అయ్యే విషయంలో ఈ పెద్దమనిషి చెప్పిన జోస్యం ఎంతవరకూ నిజం అవుతుందో చూడాలి.
Tags:    

Similar News