ప్రమాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా నేపాల్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు కొండపై నుంచి అదుపు తప్పి 100 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20మంది వరకు మరణించారు. 17మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఖట్మండు సమీపంలోని నువాకోట్ జిల్లాలో శనివారం ఈ ప్రమాదం సంభవించింది. గయాంగడండా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడ్డ 17మందిని సెంట్రల్ నేపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు 20 మృత దేహాలను వెలికితీసినట్టు పోలీస్ అధికారి గయాన్ లాల్ తెలిపారు. ట్రక్కులో ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించు కోవడంతోనే వాహనం అదుపుతప్పినట్టు అధికారులు తెలిపారు.