అసెంబ్లీ సమావేశాలంటేనే అధికార- ప్రతిపక్ష నేతల సవాళ్లకు వేదిక అనేది తెలిసిందే. అయితే సభా నాయకుడు - ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో లేనప్పటికీ తెలుగుదేశం నాయకులు ప్రతిపక్షానికి అసెంబ్లీలో ఘాటు కౌంటర్లే ఇచ్చారు. ప్రతిపక్ష వైసీపీ - ఆ పార్టీ అధినేత జగన్ చేసిన విమర్శలను సందర్భానుసారం తిప్పికొడుతూ వచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరించి బాబు లేకున్నా ఆ ఎదురుదాడి కొనసాగింది.
రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య తగ్గిందని, ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన మెరిట్ లిస్టును 18నెలలైనా పెట్టకపోవడాన్ని నిరసిస్తూ వైకాపా నేత జగన్ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మెరిట్ లిస్ట్ సిద్ధం చేశామని పేర్కొంటూ వచ్చేనెల పోస్టింగులు ఇస్తామని చెప్పారు. కోర్టు కేసుల వల్ల నియామకాల్లో జాప్యం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని అచెన్న తెలిపారు. ప్రతిపక్ష నేత వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న పింఛన్లను ప్రస్తావిస్తూ నవ్యాంధ్రప్రదేశ్ లో పింఛన్లు తగ్గాయని జగన్ చెప్పారని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 43 లక్షల 50 వేలమందికి పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చేసరికి 39 లక్షల పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం 43 లక్షల 50 వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ల విధానం తీసుకు వచ్చిందే ఎన్టీఆర్ అని స్పష్టం చేస్తూ....పింఛన్లపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో అర్హత లేనివారికి కూడా పింఛన్లు ఇచ్చారని ఆయన అన్నారు.