పోలీసులపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మరో సీనియర్ టీడీపీ నేత నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం. టీడీపీ ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో గురువారం అలిపిరి వద్ద రోడ్డుపై బైటాయించి రచ్చ చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు.
అనంతరం అచ్చెన్నాయుడు పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసులు, ఉద్యోగ సంఘాల నేతలను నోట్ చేసుకుంటామని.. రిటైర్డ్ అయినా ఎవరినీ వదలం అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఇంటింటికీ ధర్మ పరిరక్షణ యాత్ర నిర్వహించి తీరుతామన్నారు. సంతబొమ్మాళిలో టీడీపీ నేతలను అన్యాయంగా ఇరికించారన్నారు. బీజేపీ యాత్ర కంటే తమది స్వచ్ఛమైన యాత్ర అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చాడు.
ఇక తిరుచానూరు సమీపంలోని హోటల్ వద్ద విధినిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ దీపిక పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఇక్కడ నీకేం పని అంతు చూస్తా అని బెదిరించినట్టు ఆ మహిళ ఎస్ఐ వాపోయింది.ఇక టీడీపీ నేతలు పోలీసులు, అధికారులను లక్ష్యంగా చేసుకొని కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని పోలీస్ సంఘాలు ఖండించాయి. తమకు కులమతాలు ఉండవని.. తమదంతా ఖాకీ కులమని చెప్పుకొచ్చారు.