మా ఇష్టం మాస్క్ పెట్టుకోము .. మున్సిపల్ సిబ్బందిపై దాడి!

Update: 2021-04-17 11:30 GMT
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తుంటే .. ప్రజలు మాత్రం మాకు ఏం కాదులే అనుకుంటూ కనీసం కరోనా నియమాలు కూడా పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. మాస్కులు, భౌతికదూరం పాటించాలని అటు ప్రభుత్వాలు, ఇటు అధికారులు ఎంత మొత్తుకొని చెప్తున్నా కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మాస్క్ పెట్టుకోకపోతే జరిమానా విధిస్తున్న కొందరి పద్ధతి మారడం లేదు. పైగా మాస్క్ పెట్టుకోవాలని చెబుతున్నవారిపై కొందరు భౌతిక దాడులకు దిగుతున్నారు.

ఈ తరహా ఘటన తాజాగా నిజామాబాద్ జిల్లాలో జరిగింది. నగరంలోని గౌతం నగర్ లో మాస్క్ పెట్టుకొని చెత్త వేయాలని చెప్పినందుకు మున్సిపల్ కార్మికుల పై దాడికి దిగారు. గౌతంనగర్‌ లో ఓ వ్యక్తి మాస్కు ధరించకుండానే చెత్త వేసేందుకు బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన మున్సిపల్‌ సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని సూచించారు. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఆ వ్యక్తి  నేను మాస్కు పెట్టుకోకపోతే, మీ కేంటి అంటూ రెచ్చిపోయాడు. అతని కొడుకు సైతం పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి ప్రయత్నం చేశాడు. మున్సిపల్ సిబ్బందిని పక్కకి నెట్టేసే ప్రయత్నం చేశాడు. దీంతో తండ్రీకొడుకుల ప్రవర్తనపై మున్సిపల్‌ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Tags:    

Similar News