పాక్ లో అంతే ..అక్కడ అంతే .. పోలీసులని కూడా పరుగులు పెట్టిస్తారు!

Update: 2021-05-18 03:37 GMT
దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా  జనాలు దాడి చేశారు. ఇస్లామాబాద్ లోని గోర్లా పోలీస్ స్టేషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణపై ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  మరోవైపు అతని వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన కొందరు ప్రజలు ఆ వ్యక్తి కోసం అన్ని చోట్ల వెతికారు. రెస్టు చేసిన ఓ వ్యక్తిని తమకు అప్పగించాలంటూ వారు కర్రలు, ఇనుప రాడ్లు తీసుకోని వచ్చారు. అతను కనిపించకపోయే సరికి ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేశారు.

ఆ స్టేషన్ లో  ఆ వ్యక్తి కనపడకపోయేసరికి పోలీసులపై తిరగబడ్డారు. స్టేషన్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. తీవ్ర భయాందోళనలకు గురైన పోలీసులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వీరిని అక్కడి నుంచి చెదర గొట్టేందుకు కౌంటర్ టెర్రరిజం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, యాంటీ రయట్ యూనిట్ల నుంచి వందల సంఖ్యలో పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు. సుమారు గంట తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా ఇంతా చేస్తే దైవ దూషణకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న వ్యక్తిని పోలీసులు అప్పటికే అజ్ఞాత ప్రదేశానికి తరలించినట్టు తెలిసింది. దైవ దూషణకు దిగే వారిపై పాకిస్థాన్ లో కఠినమైన శిక్షలు ఉంటాయి. మహమ్మద్ ప్రవక్త గురించి చెడుగా మాట్లడిన 29 మందికి 2019లో మరణశిక్షలు విధించారు. ఎంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు.ఆ  చట్టాలను సవరించి కొంత మానవత్వం చూపాలని అంతర్జాతీయ దేశాలు చేస్తున్న అభ్యర్థనను పాకిస్థాన్ పెడచెవిన పెడుతోంది
Tags:    

Similar News