ఆప్ మహిళా ఎమ్మెల్యే ను రాయితో కొట్టారు

Update: 2015-08-09 08:55 GMT
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లంబా పై ఆదివారం దాడి జరిగింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆమె ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ ప్రాంతంలో పర్యటిస్తుండగా  గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పై దాడికి పాల్పడ్డారు. ఒక రాయి నేరుగా ఆమె తలకు తగిలింది. అనంతరం ఆమె మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తుల లక్ష్యం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్కడ నుంచి పారిపోయేలా చేయడమేనని ఆమె ఆరోపించింది..  మాదక ద్రవ్యాల గురించి తెలియజేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చినప్పటికీ ఈ సంఘటనతో వారు తమ గొంతు విప్పడానికి భయపడ్డారని అల్కా లంబా చెప్పింది.

కాగా దాడికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాన్ని ఆప్ నాయకుడు అశుతోష్ వ్యక్తం చేశారు.  అయితే ఆప్ అధినేత కేజ్రీవాల్ లాగే ఆ పార్టీ అందాల ఎమ్మె ల్యే అల్కా లాంబా కూడా హడావుడి చేయడంలో దిట్ట. మీడియాను ఆకర్షించడంలో స్పెషలిస్టు. కొద్దినెలల కిందట ఆమె ఢిల్లీలో ఓ చోటికి వెళ్లగా అక్కడ ఓ యువకుడు తనకు కన్ను కొట్టాడంటూ ఆయన చెంపలు వాయించి హైలైట్ అయింది. తాజా దాడి కూడా ఆప్ చేయించిందేనని... ఇందులో తమ హస్తం లేదని బీజేపీ అంటోంది. రైతుల ఆత్మహత్యల సమయంలోనూ ఆప్ వేసిన ఎత్తుగడ వికటించి అన్యాయంగా ఓ రైతు చనిపోయాడని.. డ్రామాలు ప్లే చేయడంలో ఆప్ ఎంత నీచానికైనా దిగజారుతుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా పాపం ఈ మహిళా ఎమ్మె ల్యే తలకు కట్టుతో కనిపిస్తుంటే అభిమానులు తట్టుకోలేకపోతున్నారట.
Tags:    

Similar News