ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నం.. ఉద్రిక్తం

Update: 2022-01-03 08:06 GMT
ఏపీలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసానికి యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు జిల్లా దుర్గి మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ తెలిపారు.

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింప చేసిన మన అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ అని రామకృష్ణ కొనియాడారు. అలాంటి మహానుభావుడి విగ్రహం ధ్వంసం చేయడం అంటే తెలుగు జాతిని అవమానించినట్లేనని అన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఏపీ ప్రభుత్వం, పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహంపై చేయి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఎన్టీఆర్ అభిమానులు ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోమని.. మీరు కూడా తక్షణమే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేసి శిక్షించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోని ఒప్పిచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. మాచర్ల నియోజకవర్గ ఇన్ చార్జి జూలకంటి సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈపూర్ స్టేషన్ కు తరలించారు.
Tags:    

Similar News