ఈ ఉదంతం గురించి తెలిసినప్పుడు.. సంబంధం లేకున్నా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన భాషా మూవీ చప్పున గుర్తుకు వస్తుంది. ఎన్నో సినిమాలకు స్ఫూర్తినిచ్చిన భాషాలో రజనీ క్యారెక్టర్ ను పోలి ఉండేలా ఈ రియల్ ఆటోవాలా వ్యవహారం ఉందా? అన్న అనుమానం కలుగక మానదు. ఎందుకంటే..?
అతడో ఆటావాలా. అతడి పేరు సుబ్రహ్మణి. ఆటోతో బతుకు బండి లాగిస్తుంటాడు. కానీ.. ఇటీవల అతగాడు చేసిన ఒక పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. బెంగళూరు మహానగరంలో అతగాడుంటే మహదేవపుర నియోజకవర్గ పరిధిలోని ఆటోవాలాలలో అతడి వ్యవహారం హాట్ టాపిక్. ఎందుకంటే.. ఇటీవల అతడు అత్యంత ఖరీదైన వైట్ ఫీల్డ్ పరిధిలో ఖరీదైన విల్లాను కొనటమే. ఆటోవాలా ఏంటి? ఖరీదైన విల్లా కొనటం ఏమిటి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఇది కాస్తా.. ఆ నోటా.. ఈ నోటా పాకి చివరకు ఐటీ శాఖ దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఇప్పటివరకూ ఆదాయపన్ను పైసా కట్టని వ్యక్తి.. ఏకంగా వైట్ ఫీల్డ్ లో విల్లా ఎలా కొన్నాడన్న క్వశ్చన్ వారికి వచ్చింది. ఇతగాడి గురించి ఆరా తీసిన ఐటీ శాఖ.. తాజాగా అతడి నివాసం మీద దాడులు నిర్వహించి.. ఇంట్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువను ఇంకా లెక్క వేయలేదు. పలువురు రాజకీయ నేతలకు సుబ్రహ్మణ్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు.. వారంతా బీజేపీ నేతలుగా అధికారులు గుర్తించారు. అతడింట్లో దొరికిన ఫోటోలు.. నేతలతో అతడికున్న సంబంధాలు తెలిపేలా ఉన్నాయని చెబుతున్నారు.
ఆటోవాలాగా సాదాసీదా జీవితాన్ని గడిపే వ్యక్తి.. ఖరీదైన విల్లాను ఎలా కొనుగోలు చేశాడు? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఇంత మంది రాజకీయ నేతలతో అతగాడికున్న సంబంధాల లెక్క తేల్చే పనిలో అధికారులు పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన తనిఖీల అనంతరం.. అతగాడిని తమ ముందుకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.