వివేకా హత్యపై అవినాశ్ తరపు లాయర్ తాజా వాదనలివే

Update: 2023-05-27 10:22 GMT
సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ ను రద్దు చేస్తే కానీ.. సుప్రీంకోర్టు చెప్పిన జూన్ 30 గడుపు లోపు వివేకా హత్య కేసు విచారణను పూర్తి చేయగలమని సీబీఐ వాదిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో జరిగిన ఈ వాదనల నేపథ్యంలో.. సీబీఐ తీరును తీవ్రంగా తప్పు పట్టమే కాదు.. ఎంపీ అవినాశ్ రెడ్డికి ఈ మొత్తం వ్యవహారంలో అస్సలు సంబంధం లేదన్న విషయాన్ని ఆయన తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఇ. ఉమామహేశ్వరరావు కీలక అంశాల్ని ప్రస్తావించారు. సీబీఐ విచారణను తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. పలు అంశాల్ని తన వాదనల్లో కోర్టులో వినిపించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది తమ వాదనల్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

-  వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉంది. ఇందుకు పలు అంశాలు ఉన్నాయి. హత్య తర్వాత పోలీసులు.. సిట్ దర్యాప్తు అంశాలకు చెందిన కేసు డైరీని మూడేళ్లు అయినా కోర్టుకు సమర్పించలేదు.

-  ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కౌంటర్ లోని అంశాల ఆధారంగా నిందితుడు అని ముద్ర వేస్తున్నారు. హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి లభించిన రక్షణ గత నెల 26న సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రద్దు అయిపోయింది. అప్ప నుంచి ఈ నెల 15 వరకు విచారణకు పిలువలేదు.

- ప్రస్తుతం అవినాశ్ తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడే ఈ హడావుడి ఎందుకు? సాక్ష్యాధారాలను చెరిపేశారన్న ఆరోపణలపై పిటిషనర్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు చేశారు. అవే ఆరోపణలతో అవినాశ్ ను నిందితుడిగా చేస్తున్నారు.

-  రక్తపు మరకలను శుభ్రం చేస్తున్న వేళ అవినాశ్ రెడ్డి బెడ్రూంలో లేరని.. బయట వరండాలో తిరుగుతున్నట్లు సిబీఐ స్వయంగా తన కౌంటర్ లో చెప్పింది. రక్తపు మరకలను శుభ్రం చేసిన పని మనుషఉలు కూడా అవినాశ్ రెడ్డి పేరు చెప్పలేదు.

-  గుండెపోటు కారణంగా వివేకా చనిపోయినట్లు అవినాశ్ చెప్పారని ఏ ఒక్కరూ వాంగ్మూలం ఇవ్వలేదు. ఈ కేసులో హత్యలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేసిన సీబీఐ.. దస్తగిరిని మాత్రం అదుపులోకి తీసుకోలేదు. ముందస్తు బెయిల్ కు వ్యతిరేకించకుండా.. క్షమాభిక్ష ప్రసాదించాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

-   నిందితుడిగా ఉన్న వ్యక్తికి క్షమాభిక్షప్రసాదించక ముందే సాక్షిగా పేర్కొంటూ అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రస్తుతం అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉందని పేర్కొన్నారు. కస్టడీకి ఇవ్వాలో.. వద్దో కూడా కోర్టు నిర్ణయించకుండానే సీబీఐ అన్నీ తానే చెప్పేస్తుంది.

-  హత్యలో పాల్గొన్న వ్యక్తి గురించి తెలిసిన వెంటనే అదుపులోకి తీసుకోలేదు. విచారణ పేరుతో అనుకూలంగా వ్యవహరించారు. సీబీఐ పెంపుడు జంతువు అయిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తప్పించి అవినాశ్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు.

-  హత్యలో పాల్గొన్న నలుగురికి ఒక్కో కారణం ఉంది. బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ కు సంబంధించి రూ.8కోట్లలో వాటా ఇవ్వలేదని గంగిరెడ్డికి కోపం ఉంది.

-  సునీల్ యాదవ్ తల్లి.. గజ్జల ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకా సంబంధాలు కలిగి ఉండటంతో కక్ష కట్టారు. దస్తగిరిని ఉద్యోగం నుంచి తీసేయటంతో కక్ష పెంచుకున్నారు.  

-  వివేకా హత్య కోసం గంగిరెడ్డికి రూ.కోటి ఇచ్చారు. అందులో సునీల్ యాదవ్ రూ.25 లక్షలు తీసుకొని.. రూ.75 లక్షలు దస్తగిరికి ఇచ్చారు. రూ.75 లక్షల్లో కొంత్ మొత్తాన్ని మున్నా అనే వ్యక్తి వద్ద దస్తగిరి దాచినట్లుగా తేలింది. మిగిలిన మొత్తం ఎక్కడ ఉందన్న విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదు.

-  సాక్ష్యుల్ని బెదిరించినట్లుగా సీబీఐ చెబుతోంది. కానీ.. ఎవరిని బెదిరించారో చెప్పడం లేదు. సీబీఐ వాదనలు వినేందుకు కోర్టు విచారణను శనివారానికి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Similar News