టీడీపీ సీనియన్ నేత - విశాఖకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు కోర్టుకు హాజరయ్యారు. స్వయంగా ఆయనే వెళ్లి జడ్జి ముందు నిల్చున్నారు. 2012లో పాయకరావుపేట ఉప ఎన్నిక జరిగింది. ఆ సమయంలో టీడీపీ తరఫున ప్రచారం చేసిన అయ్యన్న.. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. భారీ ఎత్తున నగదు పంచారు. సమయం మించిపోయినా కూడా ప్రచారం చేశారు. దీంతో అప్పట్లోనే ఈ విషయం పెద్ద ఎత్తున దుమారం రేపింది. అయితే, దీనిపై అప్పట్లోనే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదైంది.
అప్పటి నుంచి దీని విచారణ సాగుతూనే ఉంది. అయితే, ఈ విచారణలకు అయ్యన్న డుమ్మా కొడుతూ వచ్చారు. అంతేకాదు... సరైన వివరణ కూడా కోర్టుకు సమర్పించలేదు. దీంతో ఎలమంచిలి కోర్టు అయ్యన్నకు ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. దీంతో ఆయన ఇక తప్పించుకోలేని పరిస్థితిలో శుక్రవారం ఉదయం స్వయంగా కోర్టుకు హజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట హాజరై, తనపై ఉన్న నాన్ బెయిల్ ఆర్డర్‌ను రీకాల్ చేయించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిప్పులు చెరిగారు.
2012లో అప్పటి కిరణ్ కుమార్ ప్రభుత్వం టీడీపీపై కక్షసాధింపులకు దిగిందని, ఈ క్రమంలోనే తనపై కేసు నమోదైందని ఆరోపించారు. అయినా కూడా తాను కాంగ్రెస్ నేతలకు భయపడిపోనని చెప్పారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, గతంలోనూ అనేక తప్పుడు కేసులు తనపై నమోదు చేయించారని, చివరికి వాటిని కాంగ్రెస్ నేతలే స్వయంగా ఉప సంహరించుకున్నారని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కేసు నిలబడదని అన్నారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, త్వరలోనే ఈ కేసు నుంచి బయట పడతానని అన్నారు.