జగన్ ఫోన్ ఎత్తారు కానీ..?

Update: 2015-10-17 04:50 GMT
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను రానని.. అందుకే తనకు ఆహ్వానం పంపొద్దంటూ ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించటం తెలిసిందే. అయితే.. తమ పని తాము అన్నట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ మంత్రులు జగన్ కు పలుమార్లు ఫోన్ చేయటం.. ఆయన లిఫ్ట్ చేయకపోవటం తెలిసిందే. దీంతో.. ఏం చేయాలో పాలుపోక జగన్ పీఏకు ఫోన్ చేసినా ఫలితం దక్కని పరిస్థితి.

ఈ నేపథ్యంలో మీడియాలో వార్తలు విస్తృతంగా వచ్చాయి. మరి.. ఏమనుకున్నారో కానీ.. ఏపీ మంత్రులు చేసిన ఫోన్ కాల్ కు శుక్రవారం జగన్ ఫోన్ ఎత్తారు. అయితే.. తనకు అత్యంత సన్నిహితుడైన వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడాలంటూ జగన్ సమాధానం ఇచ్చి.. ఫోన్ ఇచ్చేశారు. ఫోన్ తీసుకున్న సుబ్బారెడ్డి ఏపీ మంత్రులతో మాట్లాడుతూ.. జగన్ ఆరోగ్యం బాగోలేక పడుకున్నారని చెప్పగా.. తమకు జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే.. వచ్చి కలుస్తామని చెప్పారు.

దీనికి స్పందించిన వైవీ సుబ్బారెడ్డి.. జగన్ తో ఈ విషయం గురించి మాట్లాడి.. ఏ విషయాన్ని శనివారం ఉదయం చెబుతామని చెప్పారు. దీంతో.. శనివారం ఉదయం వచ్చే ఫోన్ కాల్ ఆధారంగా తాము జగన్ ను కలిసేది లేనిది తెలుస్తుందంటూ ఏపీ మంత్రి అయ్యనపాత్రుడు వెల్లడించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వానం విషయంలో జగన్ మరీ ఇంత లొల్లి చేయాలా?

శుభకార్యం పిలుపులు పిలిచేందుకు వస్తామన్న శత్రువునైనా ఇంటికి సాదరంగా ఆహ్వానించే వైఖరికి భిన్నంగా జగన్ వ్యవహరించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరీ.. మొండితనంతో ఆహ్వానం తీసుకోవటానికి కూడా జగన్ నో చెప్పటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి.. శనివారం ఉదయం ఏం చెప్పి ఇంటికి వచ్చే మంత్రుల్ని వద్దంటారో చూడాలి.
Tags:    

Similar News