తరచూ వివాదాల్లో ఉండే సమాజ్ వాదీ నాయకుడు - యూపీ మంత్రి అజాంఖాన్ ఈ దఫా ప్రధాని నరేంద్రమోడీపై తన అస్త్రాన్ని గురిపెట్టారు. భార్యకు తగిన గుర్తింపు ఇవ్వని వ్యక్తి కుమార్తెల గురించి ఎలా మాట్లాడతారని అజాంఖాన్ ప్రశ్నించారు. ఆయన చేసే పనులకు చెప్పే మాటలకు పొంత ఉండదని వ్యాఖ్యానించారు.
'మోడీ తన తల్లిని ఇంటికి తెచ్చుకున్నారు. కుమార్తెల గురించి, వారి రక్షణ గురించి మాట్లాడుతారు. కానీ మోడీ భార్యకు తగిన గుర్తింపు ఎందుకు ఇవ్వరు? భార్యను కూడా గుర్తిస్తే ఆయనపై మరింత గౌరవం కలుగుతుంది' అంటూ సూచనతో కూడిన సెటైర్ వేశారు. దేశంలో మైనారిటీలను పాకిస్థాన్ పంపించే విషయం మాట్లాడే మోడీ కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆ దేశంలో పర్యటించి వస్తారని అజాంఖాన్ విమర్శించారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లి కాళ్లకు మెక్కిన మోడీ - రహస్యంగా దేశ ద్రోహులతో షేక్ హ్యాండ్ చేశారని ఆయన దుయ్యబట్టారు. సొంత పార్టీ నేతలు అని కూడా చూడకుండా గతంలో జయప్రద - అమర్ సింగ్ లపై అజంఖాన్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అజంఖాన్ మరోమారు తెరమీదకు వచ్చారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.