తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత ఇంట విందుకు గులాబీ దళపతి హాజరుకానున్నారట. ప్రముఖ క్రీడాకారుడు - కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ ఆ హస్తం నాయకుడు. ఆయన కుమారుడు అసదుద్దీన్ - టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్ మీర్జా ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 12న అసదుద్దీన్ - ఆనం మీర్జా వివాహ విందు జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను అజహరుద్దీన్ - సానియా మీర్జా ప్రగతిభవన్ లో కలిశారు. వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని అజహర్ - సానియా సీఎంను కోరారు.
హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్ ను నిఖా చేసుకున్న సానియా సోదరి ఆనమ్ మీర్జా విడాకులు తీసుకుని అజహర్ కుమారుడు అసదుద్దీన్ ను వివాహమాడబోతుంది. గత కొంత కాలంగా అసద్ - ఆనమ్ లు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు అసదుద్దీన్-ఆనమ్ లు తీసుకెళ్లారు. ఇప్పటికే ఈ రెండు కుటుంబాలు కలిసి వీరిద్దరి నిశ్ఛితార్థ వేడుకను ఘనంగా నిర్వహించాయి. 12వ తేదీన విందు ఇవ్వనున్నారు. ఈ వివాహ విందుకు కేసీఆర్ ను ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అజారుద్దీన్ ఇటీవల టీఆర్ ఎస్ మద్దతుతో హెచ్ సీఏ అధ్యక్షుడిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. మరోవైపు సానియామీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కేసీఆర్ నియమించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రముఖుల కుటుంబాల మధ్య కుదిరిన పెళ్లిసంబంధ విందుకు కేసీఆర్ హాజరు కానున్నట్లు సమాచారం.