ఈ బాబాకు సిగ్గులేదు సరే... వారికేమైంది!

Update: 2016-07-29 06:26 GMT
బాబాలందు దొంగబాబాలు వేరయా అనాలో లేక ఉన్నవారిలో గరిష్ట సంఖ్య ఆకోవలోకే వాస్తారనుకోవాలో తెలియదు కానీ.. రోజు రోజుకీ ఈ దొంగ బాబాల ఆగడాలు వికృత చేష్టలుగా మారిపోతున్నాయి. వీరివద్దకు వెళ్లే ప్రజలు అమాయకులు అనుకోవాలా, మూర్ఖులనుకోవాలో తెలియని సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. తాజాగా థానేలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే.. బాబాలను ఆశ్రయించేవారికి బుర్ర ఉండదు అనే నానుడి ప్లేసులో సిగ్గుకూడా ఉండదు అనే వ్యాఖ్య చేర్చాల్సి వస్తుందేమో. ఎందుకంటే.. ఈ బాబా చేయమన్న పని, ఆ భక్తులు చేసిన పని అలా ఉంది మరి!

విషయానికొస్తే... థానే లోని సర్వర్కర్ నగర్ కు చెందిన ఒక మహిళకు చాలా సంవత్సరాల క్రితం పెళ్లయ్యింది. పెళ్లయి ఎన్నేళ్లయినా పిల్లలు లేకపోవడంతో.. హాస్పటల్స్ కు వెళ్లడం మానేసి బాబా దగ్గరకి వెళ్లారు. తనవద్దకు వచ్చిన వారి అజ్ఞానమే తన జ్ఞానం అని నమ్మే బాబా ఆ మహిళను - తన భర్తను వెంటపెట్టుకుని రామన్నాడు. బాబా చెప్పినట్లుగానే... తన భర్తతో కలిసి వెళ్లింది ఆ మహిళ. అప్పుడే మొదలైంది అసలు విషయం.

ఈ జంటను చూసిన బాబా... ఆ జంటకు ఒక సూచన చేశాడు... దిమ్మ తిరిగి మైండ్ బ్లాకయ్యే ఆ సుచనేమిటో తెలుసా? ఆ జంట.. బాబా ముందు బహిరంగంగా శృంగారం చేస్తే పిల్లలు పుడతారని చెప్పడం. ఇంతకు మించిన నీచాతినీచమైన పనేమైనా ఉంటుందా? ఏమో ఆ బాబాకే తెలియాలి! సరే బాబా గారికి మతిభ్రమించో, అలవాటైన వికృత చేష్టల్లో భాగంగానో సిగ్గు వదిలేసి అలా చెప్పాడు. అది విన్న భక్తులు కూడా సిగ్గు వదిలేసి బాబా ముందే కార్యం మొదలెట్టేశారు. కొద్దిసేపటి తర్వాత కల్పించుకున్న బాబా.. పూజచేయాలని చెప్పి భర్తను బయటకు పంపాడు. తర్వాత విషయం తెలిసిందే... దీంతో షాకైన ఆమె.. తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని భర్తకు చెప్పడం, అతడు పోలీసులకు సమాచారమందించడం, ఆ బాబాను జైలుకు పంపడం వెంటవెంటనే జరిగిపోయాయి.
Tags:    

Similar News