దేశం మొత్తం ఈ తీర్పు కోసం చూస్తోంది..

Update: 2019-10-17 11:31 GMT
అయోధ్య కేసుపై తుది తీర్పు వెల్లడించడానికి సమయం ఆసన్నమైంది. విచారణ బుధవారంతో ముగియడంతో తీర్పును సుప్రీం కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రిజర్వ్ లో ఉంది. ఇప్పుడు దేశం మొత్తం ఈ తీర్పు కోసం ఎదురుచూస్తోంది.

 మత కల్లోలాలకు - హిందూ ముస్లిం ఘర్షణలకు కారణమైన ఈ కేసును 1992 బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి కొనసాగుతోంది. ఇంతటి సంక్లిష్టమైన కేసులో తీర్పును ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తన విదేశీ పర్యటనను సైతం రద్దు చేసుకోవడం గమనార్హం.

ఈనెల 18న రంజన్ దుబాయ్ పర్యటన ఉంది. ఆ తర్వాత వరుసగా కైరా - బ్రెజిల్ - న్యూయార్క్ లలో కొన్ని కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. 31న భారత్ కు వచ్చేలా షెడ్యూల్ ఉంది. అయితే అయోధ్య కేసును పూర్తి చేసి తీర్పునిచ్చేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తన విదేశీ పర్యటనను రద్దు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 17న రిటైర్ కానున్న సీఐజే రంజన్ ఆలోపే అయోద్య కేసులో తీర్పునివ్వాలని పట్టుదలగా ఉన్నారు.
   

Tags:    

Similar News