పవన్‌ పై బాబు గోగినేని విమర్శలు

Update: 2018-04-14 16:32 GMT
టాలీవుడ్‌ ను కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణల నేపథ్యంలో హేతువాది బాబు గోగినేని కూడా దీనిపై స్పందించారు. ఈ విషయంలో పెద్ద హీరోలు సైలెంటుగా ఉన్నారంటూ బాబు గోగినేని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై ప్రత్యక్షంగా - మరికొందరు హీరోలపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. తెలుగు సినీ ఇండస్ర్టీలో మహిళలపై జరుగుతున్న వేధింపులను అంతా చిన్నవిగా చూపిస్తున్నారని.. ఈ రోజు పవన్ దీనిపై మాట్లాడడం ఆహ్వానించదగ్గదే అయినా ఇంతవరకు ఆయన దీనిపై ఎందుకు మాట్లాడలేదని గోగినేని ప్రశ్నించారు.
    
పోలీస్ స్టేషన్లు - కోర్టుల్లో ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని పవన్ చెప్పడంతో తాను కూడా అంగీకరిస్తున్నానని.. అయినా సినీ పెద్దలు దీనిపై స్పందించాల్సిన అవసరం మాత్రం ఉందన్నారాయన. ఎంతోమంది మహిళలు ఇక్కడ ఇబ్బందులు పడ్డప్పుడు పవన్ ఎక్కడున్నాడు. కాలరెగరేసుకుని తిరిగే పెద్దపెద్ద హీరోలు దీనిపై ఎందుకు మాట్లాడడం లేదు అంటూ ఆయన ఘాటైన విమర్శలు చేశారు.
    
పనిలో పనిగా ఆయన మరికొందరు సీనియర్ హీరోలపైనా పరోక్ష విమర్శలు చేశారు. లెజెండ్ హోదా కోసం పోరాడే హీరోలంతా ఏమయ్యారు. వారెందుకు మాట్లాడరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదేమీ పెదరాయుడు సినిమా కాదు సొంత తీర్పులు ఇవ్వడానికి.. అన్యాయానికి గురైనవారికి న్యాయం జరగాలంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
Tags:    

Similar News