టీడీపీ అధ్యక్షుడి ఎంపికలో బాబు అయోమయం!

Update: 2020-06-03 11:30 GMT
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.. తెలంగాణకు ఇప్పటికే ఎల్. రమణ ఉండగా.. ఏపీలో ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట..

మహానాడులోనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కమిటీల ఎన్నికలను పూర్తి చేస్తారు. ఈసారి కరోనా-లాక్ డౌన్ తో మహానాడు వాయిదా పడింది. జూమ్ యాప్ లోనే అది తూతూ మంత్రంగా ముగిసింది.

జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే.. తెలంగాణకు ఎల్.రమణనే కొనసాగించవచ్చు. ఇక ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కళావ వెంకట్రావ్ ను తప్పించాలని బాబు గతంలోనే నిర్ణయించారు. ఓడిపోయిన నేతను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం సరికాదని చంద్రబాబు భావిస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ అధ్యక్ష రేసులో అచ్చెన్నాయుడు పేరు వినిపిస్తోంది. బీసీలు గత ఎన్నికల్లో పార్టీకి దూరం కావడంతో బీసీ వర్గానికే చెందిన అచ్చెన్నాయుడికి అవకావం ఇవ్వాలని బాబు భావించారు. అయితే అచ్చెన్నాయుడు దూకుడుగా ఉంటాడని..దీనివల్ల ఇబ్బందులు వస్తాయని పార్టీ నాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. అచ్చెన్న లాంటి బలమైన నాయకుడు బలపడితే భవిష్యత్తులో చంద్రబాబు సీటుకే ఎసరు వచ్చేలా ఉంటుందని అందుకే ఆయన ఎంపిక వాయిదా పడిందని సమాచారం.
Tags:    

Similar News