కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రతిపక్షం మీద దృష్టిపెట్టిన టీడీపీ పార్టీ ఇంకో ఎమ్మెల్యేను ఆకర్షించింది. కడప జిల్లా బద్వేలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జయరాములు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పటికే కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజా చేరికతో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చినట్లయింది.
జగన్ సొంత జిల్లా నుండే చేరికలను ప్రోత్సహించడం ద్వారా ప్రతిపక్ష నేతల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన జయరాములు ఆ వెంటనే పార్టీలో చేరిపోయారు. ఇప్పటికే భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ తదితరులు పార్టీ వీడారు. తాజాగా మరో ఎమ్మెల్యే వెళ్లిపోవడం జగన్ కు మింగుడు పడని అంశమే.