కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. ఇప్పటివరకు 35మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గడువులోగా వచ్చినవారి నుంచీ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. నిన్న ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ వేసిన వారిలో వైకాపా, భాజపా, కాంగ్రెస్, స్వతంత్రులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 11న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు 13 వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కడప జిల్లా బద్వేలు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పాల్గొన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా పనతల సురేష్ను ఎంపిక చేశారు. భాజపా అభ్యర్థి సురేష్ , శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. పెనగలూరు మండలానికి చెందిన సురేష్.. 2019 ఎన్నికల్లో రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఏబీవీపీ తరఫున, భాజపా తరఫున జిల్లాలో అనేక ఉద్యమాలు చేసిన సురేష్ ఉన్న పేరు ప్రతిష్ఠలు, ఎన్నికల్లో కలిసి వస్తాయని భావిస్తున్నారు.
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక అసెంబ్లీ స్థానానికి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొట్టిపోగు కమలమ్మ నామినేషన్ వేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్తో కలిసి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. కడప జిల్లా నిండుకుండలా మారిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని శైలజానాథ్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు.
బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం లో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్ ఇవ్వటంతో..ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.