పంచ్ డైలాగులతో వెండితెరను ఇరగ కుమ్మేస్తుంటారు నందమూరి బాలకృష్ణ. ఆయన చెప్పే డైలాగులకు థియేటర్లు దద్దరిల్లిపోతుంటాయి. ఆయన చెప్పిన పంచ్ డైలాగుల్లో శాంపిల్ గా ఒకటి చెప్పాలంటే.. "అయిన వారికి కష్టం వస్తే అరగంటైనా ఆలస్యంగా వస్తానేమో.. అదే ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా అరక్షణం కూడా ఆగను. నరకం చూపిస్తా" (నరకం నుంచి మాత్రం ఇంగ్లిషులో డైలాగ్ చెబుతారు) అని లెజెండ్ లో బాలయ్య డైలాగులు చెబితే.. విన్న వారంతా ఎమోషనల్ అయిపోతారు. ఇదంతా రీల్ ముచ్చట. ఇక.. రియల్ కు వద్దాం. కష్టం వచ్చిన మహిళలు తమ గోడు చెప్పుకునేందుకు బాలకృష్ణ ఇంటికి వెళ్లినప్పుడు ఏం జరిగిందో చూస్తే..
రీల్ లో మాదిరే రియల్ లో కూడా బాలయ్య మహా పవర్ ఫుల్. ఆయన బావ కమ్ వియ్యంకుడు రాష్ట్రానికే ముఖ్యమంత్రి. ఇక.. అల్లుడు రాష్ట్ర మంత్రి. ఇక.. ఆయనకు ఆయన ఎమ్మెల్యే. మరింత పవర్ చేతిలో ఉన్న వ్యక్తి వద్దకు సాయం చేయాలంటూ వచ్చే మహిళల విషయంలో బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది.
గత ప్రభుత్వం తమకు ఇచ్చిన ఇంటి పట్టాల్ని రద్దు చేసి వేరే వారికి ఇస్తామని అధికారులు చెబుతున్నారన్నది వారి కంప్లయింటు. కొద్ది నెలలుగా హిందూపురం రాని బాలయ్య తాజాగా నియోజకవర్గానికి వచ్చారు. అక్కడే ఉన్నారు. దీంతో.. బాలకృష్ణ దృష్టికి తమ సమస్యను తీసుకెళితే పరిష్కారం లభిస్తుందన్న పుట్టెడు ఆశతో ఆదివారం ఉదయం 7 గంటలకే మహిళలు వచ్చారు. అయితే.. గంటలు గడుస్తున్నా బాలకృష్ణ మాత్రం ఇంట్లో నుంచి వచ్చింది లేదు. చివరకు పదకొండు గంటల వేళలో.. వేరే కార్యక్రమానికి వెళ్లే పని మీద ఇంటి నుంచి బయటకు వచ్చారు. అప్పటికే గంటల కొద్దీ టైం ఇంటి బయట ఎదురుచూస్తున్న మహిళలు.. ఆయన్ను చుట్టుముట్టి తమ కష్టాన్ని చెప్పుకున్నారు. ఎన్నికల వేళలో అందరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఏకంగా ఇచ్చిన భూములే లాగేస్తారా? అంటూ ఆయన్ను చుట్టుముట్టారు. దీంతో.. తహసీల్దార్ విశ్వనాథ్ ను పిలిపించిన బాలయ్య వారి కష్టాన్ని తీర్చాలంటూ ఆయనకు చెప్పి ఇంటి లోపలకు వెళ్లిపోయారు. ఇంటి పట్టాలు ఇవ్వటంతో తాము పునాదుల వరకూ పనులు చేసుకున్నామని.. ఇప్పుడు ఇవ్వమని చెబితే ఎలా కుదురుతుందని తహసీల్దార్ తో వాగ్వాదానికి దిగారు. తమను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇంతలో.. కొందరు తాము ఆత్మహత్య చేసుకునే విషయాన్ని పోస్టర్ రాసి ప్రదర్శిస్తుంటే.. పోలీసులు లాగేశారు. వేరే కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చిన బాలకృష్ణ మళ్లీ ఇంటి బయటకు రాగా.. తమ కష్టం గురించి మరోసారి వారు వాపోయారు. అధికారికి చెప్పాను కదా.. చేస్తార్లే అన్న మాట బాలయ్య నోటినుంచి వచ్చాయి. తమ సమస్యను పరిష్కరించేంతవరకూ తాము కదలమని ఒక మహిళ తెగేసి చెప్పగా.. తహసీల్దార్ చూస్తార్లే అంటూ వాహనంలో వెళ్లిపోయారు. దీంతో.. అక్కడున్న మహిళలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఎంతైనా రీల్ రీలే.. రియల్ రియలే సుమా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/