విశాఖ నుంచి పోటీలో ఉన్న చిన్నల్లుడు శ్రీ భరత్ కోసం ప్రచారానికి వెళ్లి జనసేన పై ధ్వజమెత్తారు నందమూరి బాలకృష్ణ. విశాఖలో త్రిముఖ పోరు నేపథ్యంలో జనసేన మీద బాలకృష్ణ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎన్నికల సింబల్ ను ఉద్దేశించి.. ఎద్దేవా చేశారు. ‘గ్లాస్ బార్ లో ఉండాలి.. సైకిల్ జనంలో ఉండాలి..’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. భీమిలిలో బాలకృష్ణ ప్రచారం సాగింది. ఎంపీ అభ్యర్థిగా భరత్ ను - భీమిలి ఎమ్మెల్యేగా సబ్బం హరిని గెలిపించాలని అంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు.
ఇక యథారీతిన బాలకృష్ణ ప్రచార పర్వంలో తన అభిమానగణంలోని వారిపై రెచ్చిపోయారు. వార్నింగులు - హెచ్చరికలు జరిగాయి. బాలకృష్ణ ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో అక్కడకు వచ్చిన ఆయన అభిమానులు ‘జై బాలయ్య..’అంటూ నినాదాలు చేశారు.
ఆ అరుపులు తన ప్రసంగానికి అడ్డుగా భావించిన బాలకృష్ణ ‘ఏయ్.. మాట్లాడకు..’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైకు పక్కన పెట్టి వీరావేశంతో చేయి చూపుతూ నినాదాలు చేస్తున్న అభిమానులను బాలకృష్ణ గద్దించారు. పబ్లిక్ లో కూడా ఇలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం బాలకృష్ణకు అలవాటుగానే ఉంది. ఎన్నికల ప్రచారంలో కూడా బాలకృష్ణకు ఇలా టెంపర్ లేస్తూనే ఉంది. భీమిలి ప్రచార పర్వంలో కూడా అదే జరిగింది.
ఇక తన బావ చంద్రబాబు నాయుడు అమలు పరిచిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కూడా బాలకృష్ణ పలు సార్లు తడబడ్డారు.