అంతటి మొనగాడు ఎన్టీవోడే

Update: 2016-01-18 09:06 GMT
ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఒక్కమాటలో చెప్పటం చాలా కష్టం. ఆయన గురించిన విశేషాలు చెబుతూ ఉంటే.. కాలం అలా కరిగిపోతూ ఉంటుంది. తాను ప్రవేశించిన ఏ రంగంలో అయినా తన మార్క్ ను ప్రదర్శించి.. చెరగని ముద్ర వేసి వెళ్లిపోయిన మహా నేత ఎన్టీఆర్. ఆయన వర్థంతి సందర్భంగా ఆయన గురించి.. ఆయన గొప్పతనాన్ని కీర్తించారు బాలకృష్ణ.

తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆహర్నిశలు పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని.. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి ఉందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకొని పార్టీని నడిపిస్తున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడింది ఎన్టీఆర్ అన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఏమైనా.. కాంగ్రెస్ పార్టీ అహంకారాన్ని అణచటంలో ఎన్టీఆర్ మొనగాడని చెప్పక తప్పదు.
Tags:    

Similar News