నిజామాబాద్‌ లో పేప‌ర్ బ్యాలెట్టే!..క‌విత‌కు ఇబ్బందేనా?

Update: 2019-03-28 16:04 GMT
టీఆర్ ఎస్ సిట్టింగ్ ఎంపీ - తెలంగాణ సీకం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు కుమార్తె క‌విత‌కు ఇప్పుడు పెద్ద ఇబ్బందే వ‌చ్చి ప‌డింది. నిజామాబాద్ ఎంపీగా ఉన్న క‌విత‌... ఈ ఎన్నిక‌ల్లోనూ అక్క‌డి నుంచే టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు. నామినేష‌న్ల దాఖ‌లు - ప‌రిశీల‌న‌ - ఉప‌సంహ‌ర‌ణ ముగిశాక‌... నిజామాబాద్ ఎంపీ స్థానం బ‌రిలో ఏకంగా 185 మంది అభ్య‌ర్థులు నిలిచారు. వీరిలో క‌విత‌తో పాటుగా కాంగ్రెస్ త‌ర‌ఫున మాజీ ఎంపీ మ‌ధు యాష్కీ గౌడ్‌ - బీజేపీ త‌ర‌ఫున ధ‌ర్మ‌పురి అర‌వింద్ బ‌రిలో నిల‌వ‌గా... 178 మంది ఎర్ర‌జొన్న రైతులు కూడా బ‌రిలో నిలిచారు. ఎర్ర‌జొన్నకు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డం లేద‌న్న విష‌యంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ధ‌ర్నాలు - నిర‌స‌న‌ల‌కు దిగుతున్న రైతులు... త‌మ డిమాండ్‌ ను సాధించుకునే క్ర‌మంలో ఏకంగా క‌విత‌పైకి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో మూకుమ్మ‌డిగా నామినేష‌న్లు దాఖ‌లు చేసిన రైతులు... టీఆర్ ఎస్ జ‌రిపిన మంత‌నాల‌కు ఏమాత్రం లొంగ‌లేద‌నే చెప్పాలి.

నేటి సాయంత్రంతో నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు కూడా ముగియ‌డంతో రైతులు త‌మ నామినేష‌న్ల విత్ డ్రాకు నిరాక‌రించ‌డంతో పోటీకే మొగ్గు చూపిన‌ట్టుగా తెలుస్తోంది. మొత్తంగా రైతుల పోటీతో క‌విత ఏకంగా 184 మందిపై పోటీ ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇదిలా ఉంటే... 90 మంది అభ్య‌ర్థుల కంటే అధిక సంఖ్య‌లో పోటీలో ఉంటే... ఈవీఎంకు బ‌దులుగా పేప‌ర్ బ్యాలెట్ ద్వారానే పోలింగ్ నిర్వ‌హించాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో ఏకంగా 185 మంది పోటీలో ఉన్న నిజామాబాద్ స్థానానికి ఈవీఎంకు బ‌దులుగా పేప‌ర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలంగాణ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి ర‌జ‌త్ కుమార్ ప్ర‌క‌టించారు. మొత్తంగా ఓ వైపు రైతుల నుంచి పోటీ - మ‌రోవైపు పేప‌ర్ బ్యాలెట్ తో క‌విత పెద్ద ఇబ్బందినే ఎదుర్కొంటున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News