కన్నీళ్లు మంచివే.. కానీ, రాజకీయాల్లో అవి ఎందరికి కలిసివస్తాయన్నదే ప్రశ్న. సరే.. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్.. తనుచేసిన ప్రజాసంగ్రామ యాత్రకు మైలేజీ రాలేదనుకున్నారో.. వచ్చిన మైలేజీకి మరింత దన్నుగా మారుతుందని అనుకున్నారో.. తెలియదు కానీ.. తాజాగా బహిరంగ వేదికపై కన్నీరు కార్చేశారు.
కరీంనగర్‌లో నిర్వహించిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో సంజయ్ కన్నీటి పర్యాంతమయ్యారు. సభకు హాజరైన ప్రజలను చూసి... ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం సభలో మాట్లాడుతూ... కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని, హిందూధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తానని హామీనిచ్చారు. ధర్మం కోసం యుద్ధం చేస్తానని వెల్లడించారు. అవమానాలకు భయపడే వ్యక్తి కాదని పేర్కొన్నారు.
అయితే.. బండి కన్నీటిని చూసి.. సభకు వచ్చిన జనాలు ఆ సమయంలో చప్పట్లు కొట్టడం..ఇక్కడ పెద్ద సంచలనం. నిజానికి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడు.. అందునా.. సవాళ్లు ప్రతిసవాళ్లు రువ్వే బండి కంటి నుంచి నిప్పులు కురుస్తాయని అనుకున్న వారే ఎక్కువగా ఉంటే.. అకస్మాత్తుగా బండి కన్నీరు పెట్టడం.. అందరినీ విస్మయానికి గురి చేసింది.
ఇక బండి కన్నీరు ఎంత దూరం పారిందో తెలియదు కానీ, అధికార పార్టీ టీఆర్ ఎస్ నాయకులు మాత్రం ఆయనపై వ్యంగ్యాస్త్రాలను చాలా దూరం సంధించారు. ఇదో ఎత్తుగడ అని.. అభివర్ణించిన వారు ఎక్కువగా ఉన్నారు.
ఎక్కడైనా ఏ నాయకుడైనా.. భారీ ఎత్తున తరలి వచ్చిన జనాన్ని చూసి మరింత రెచ్చిపోయి కామెంట్లు చేయాలె.. మరింతగా దమ్ము బిగించి మాట్లాడాలె!కానీ ఇదేంది బిడ్డా.. ఇలా కన్నీరు పెట్టినవ్? అంటూ.. వ్యాఖ్యలు వినిపించడం గమనార్హం.
ఇదో ఎత్తుగడ అని.. తన పాదయాత్ర విఫలమై.. కన్నీటితో కవర్ చేసుకుంటున్నారని.. మరికొందరు నాయకులు వ్యాఖ్యానించారు. మొత్తానికి బండి పాదయాత్ర కంటే.. కూడా కన్నీటి కథే ఎక్కువగా చర్చకు రావడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.