బీజేపీ నేత, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేశారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలన్న డిమాండ్‌తో ఈ దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మొదట దీక్ష ఇందిరా పార్కు వద్ద చేపాట్టలని భావించారు. కానీ కరోనా నిబంధనల కారణంగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. దీంతో పార్టీ ఆఫీసులో నే దీక్షకు దిగారు బండి సంజయ్. తెలంగాణలో పట్టు బిగించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ క్రమంలో బండి దీక్షకు కూర్చున్నారు.
అయితే బండి దీక్షపై టీఆర్ఎస్ నేతలు గట్టి కౌంటరే ఇస్తున్నారు. దమ్ముంటే ఢిల్లీలో దీక్ష చేయాలని మంత్రి, సీఎం తనయుడు కేటీఆర్ సవాల్ విసిరారు. ఇదిలావుంటే, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్ష పై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 2 వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీక్షకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిర్వహించుకునేందుకు నిరాకరించారు.
కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇందిరాపార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ ఆఫీస్‌లో దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించింది. తన దీక్షకు భయపడే కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం మొదలైందని, అయితే నియామకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, 'నిరుద్యోగ దీక్ష'కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం దుర్మార్గమని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
అయితే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదంటూ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర దీక్ష చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ చేపట్టేది నిరుద్యోగ దీక్ష కాదు సిగ్గులేని దీక్ష అంటూ విమర్శించారు. దేశంలోని నిరుద్యోగులకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వల్ల తెలంగాణకు దక్కిన జాబ్‌లెన్నో చెప్పాలన్నారు . ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను రద్దు చేసింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. ఐటీ జాబ్స్‌కు గండికొట్టి యువత నోట్లో మట్టికొట్టారని, ఇప్పుడు మళ్లీ నిరుద్యోగ దీక్షలకు దిగుతారా అంటూ బండి సంజయ్‌కు రాసిన బహిరం లేఖలో నిలదీశారు.
మరోవైపు, తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని విమర్శించారు. మరోవైపు బీజేపీలో హుజురాబాద్ బైపోల్ తర్వాత జోష్ మరింత పెరిగింది. అటు హైకమాండ్ నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభిస్తోంది. ఇటీవలే అమిత్‌షాతోనూ తెలంగాణ బీజేపీ నేతలు సమావేశమయ్యారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా దూసుకెళ్లాలని ఆయన సూచించారు.
దీంతో వరుస ఆందోళనల కార్యక్రమాలతో జనంలోకి వెళ్లాలని భావిస్తోంది బీజేపీ. నిరుద్యోగ దీక్ష తర్వాత బండి సంజయ్ రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ లేఖకు కౌంటర్‌గా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగ లెటర్ రాశారు. తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆరోపించారు. రెండో దఫా అధికారం చేపట్టాక కూడా ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదన్నారు. దీనికి ఏం సమాధానం చెబుతారని మంత్రిని ప్రశ్నించారు రాజాసింగ్.