బండికి బ‌లం పెరిగిందా? మోడీ ఫోన్‌.. సీఎంల రాక‌.. బీజేపీలో చ‌ర్చ‌

Update: 2022-01-09 13:51 GMT
తెలంగాణ బీజేపీ సార‌థి.. బండి సంజ‌య్‌కు బ‌లం పెరిగిందా? ఆయ‌న అనూహ్యంగా పుంజుకున్నారా? అంటే.. బీజేపీ నేత‌లు ఔన‌నే అంటున్నారు. తాజాగా ఇదే అంశంపై బీజేపీ తెలంగాణ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్‌పై బండి దూకుడు పెంచిన విష‌యం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నిక త‌ర్వాత‌.. మ‌రింత దూకుడుగా కామెంట్లు చేస్తున్న బండి.. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే.. అప్ప‌ట్లోనే కేసీఆర్‌.. నీ అంతు చూస్తా! అంటూ.. ఎదురు దాడి చేశారు. ఈ క్ర‌మంలో నే అవ‌కాశం కోసం ఎదురుచూసిన సీఎం.. ఇటీవ‌ల ఉపాధ్యాయ స‌మ‌స్య‌పై జాగ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన బండిని అరెస్టు చేయించి జైలుకు త‌రించారు.

అయితే..జైలు నుంచి వ‌చ్చిన బండికి అనూహ్యంగా మ‌ద్ద‌తు పెర‌గ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని బీజేపీలోనే నేత‌ల మ‌ద్య చ‌ర్చ సాగు తుండ‌డం గ‌మ‌నార్హం. వ‌రుస‌గా ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు రాష్ట్రానికి రావ‌డం.. సీఎం కేసీఆర్ కేంద్రంగా వ్యాఖ్య‌లు చేయ‌డం.. వంటివి బీజేపీలో ఉత్సాహం నింపుతున్నాయి. ఇటీవ‌ల మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ వ‌చ్చారు. తాను నాలుగు సార్లు ముఖ్య‌మంత్రిన‌ని కేసీఆర్ కేవ‌లం రెండోసారి ముఖ్య‌మంత్ర‌ని.. వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌, కుటుంబ పాల‌న జ‌రుగుతోంద‌ని చౌహాన్ వ్యాఖ్యానించారు. ఇక‌, తాజాగా అసోం సీఎం వ‌చ్చారు. బండి సంజ‌య్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.

తెలంగాణ‌లో అవినీతి జ‌రుగుతోంద‌ని.. ఇది అసోంలో ఉన్న త‌మ వ‌ర‌కు కూడా వ్యాపించింద‌ని అసోం సీఎం వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఏకంగా బండి సంజ‌య్‌కు ఫోన్ చేసి.. ఇటీవ‌ల జ‌రిగిన జైలు రాజ‌కీయాల‌పై ఆయ‌న‌తో చ‌ర్చించారు. పార్టీ మీకు అండ‌గా ఉంటుంద‌ని మోడీ.. బండికి హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా బండి జైలుకు వెళ్లిన మ‌రుస‌టి రోజే.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.. తెలంగాణ‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కూడా బండికి మ‌ద్ద‌తుగా మాట్లాడారు.

ఇలా.. జాతీయ‌స్థాయిలో బీజేపీ నాయ‌కులు బండికి అండ‌గా నిల‌వ‌డాన్ని.. అదేస‌మ‌యంలో సీఎం కేసీఆర్‌ను కార్న‌ర్ చేయ‌డాన్ని గ‌మ‌నిస్తే.. వ్యూహాత్మ‌కంగా బీజేపీ తెలంగాణ‌లో చ‌క్రం తిప్పేందుకు రెడీ అయింద‌నే బావ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో బీజేపీలోనూ బండి అనుకూల వాదులు పెరుగుతున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ దూకుడు మ‌రో రెండేళ్ల‌పాటు ఇలానే ఉంటుందో.. లేక‌.. దారి త‌ప్పుతుందో.. అనేది చూడాలి. ప‌నిలో ప‌నిగా.. యూపీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం బండిని తీసుకువెళ్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. బండితోపాటు.. మ‌రికొంద‌రు ఫైర్ బ్రాండ్ల‌ను కూడా యూపీ పంజాబ్ ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి ఉప‌యోగించుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News